టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్ రేంజ్ కు ఎదుగాడు చిరంజీవి. 90 లలో చిరంజీవి వరుస బ్లాక్ బస్టర్ లో అందుకుంటూ పిక్స్ తో దూసుకుపోతున్న క్రమంలో.. ఇతర భాషల్లో కూడా ఆయనకు విపరీతమైన మార్కెట్ ఏర్పడింది. ఇక అప్పట్లో ఇండియాలోనే బాలీవుడ్ అతిపెద్ద ఇండస్ట్రీగా కొనసాగేది. హిందీ నేషనల్ లాంగ్వేజ్.. అలాగే ముంబై వేదిక కావడంతో బాలీవుడ్ మూవీస్ కు విపరీతమైన పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రాంతీయ భాష హీరో అయిన కూడా.. బాలీవుడ్లో ఆయన సినిమాలు డబ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టేవి. అలా అప్పట్లో అమితాబ్ కంటే చిరంజీవికి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారు. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరు ఏకంగా రూ. 1.2కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు అప్పటి ఓ నేషనల్ మ్యాగజైన్ ప్రకటించింది.
చిరంజీవి హిందీలో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడంతో.. 1990లో ప్రతిబంద్ టైటిల్ తో ఓ మూవీ చేశాడు. రవి రాజా పిన్నిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో జూహి చాలా హీరోయిన్గా మెరిసింది. ఇక ఈ మూవీ రాజశేఖర్ తెలుగులో చేసిన అంకుశం సినిమాకు రీమేక్. ఇది హిందీలో కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో చిరంజీవి పేరు బాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఇక హిందీ పరిశ్రమ టాలీవుడ్ కంటే పెద్ద ప్లాట్ ఫామ్ కావడంతో.. చిరంజీవి ముంబైలోనే సెటిల్ అవుతాడని.. హిందీ సినిమాలనే చేస్తూ బాలీవుడ్ కు పరిమితమవు తాడంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇక తర్వాత హిందీ ఛానల్ కు చిరు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అవుతూ.. అది అసలు సాధ్యం కాదు. మా ఇల్లు చెన్నై, అయినా ఫ్యామిలీ సభ్యులు ముంబైలో ఇమ్మడలేరు.. నేను హిందీ సినిమాలు చేస్తా. కానీ.. ముంబైలో మాత్రం సెటిల్ కానంటూ వివరించాడు.
ఇక ఈ మూవీ సక్సెస్ ప్రతి ఒక్కరికి దక్కుతుందని.. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ, అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఈ సక్సెస్ వస్తుందని చిరంజీవి ప్రతిబంద్ మూవీ సక్సెస్ మీట్ లో వివరించారు. ఈ క్రమంలోనే ఆయన హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అలా.. టాలీవుడ్ ఇండస్ట్రియల్ హిట్ గ్యాంగ్ లీడర్ ను ఆజ్ కా గూండా టైటిల్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయగా.. తర్వాత ది జెంటిల్మెన్ మూవీ నటించాడు. అప్పట్లో ఈ రెండు సినిమాలు సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెడితే తెలుగు ఆడియన్స్ కు దూరమయ్యే ప్రమాదం ఉందని భావించిన చిరు.. బాలీవుడ్ లో సినిమాలకు చెక్ పెట్టాడు. అప్పటికే టాలీవుడ్లో కాస్త డామేజ్ జరిగింది. ఆ టైంలో చిరు నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. హిట్లర్ మూవీ తో మల్లి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి ట్రాక్ ఎక్కాడు. ఇక ప్రస్తుతం ఏడుపదుల వయసులోనూ చిరంజీవి వరస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. త్వరలోనే ఆయన నుంచి విశ్వంభర సినిమా ఆడియన్స్ ను పలకరించనుంది.