సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇందులో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో అసలు చెప్పలేరు. ఎంత టాలెంట్, అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిన నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక.. హీరోల పరిస్థితి ఎలా ఉన్నా ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి రాణిస్తున్న ముద్దుగుమ్మల లైఫ్ స్పాన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి మూవీతోను తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్గా వరుస సక్సెస్‌లు అందుకుంటూ మరిన్ని సినిమా అవకాశాలను దక్కించుకోవాలని భావిస్తారు.
అలా.. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా మారిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఆమె మరెవరో కాదు.. రంభ. కెరీర్ మొదట్లో.. చిరంజీవి హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆయనతో కలిసి హిట్లర్ సినిమాలో నటించి మెప్పించింది. తర్వాత వీళ్ళ కాంబినేషన్‌లో బావగారు బాగున్నారా సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే వరుసగా నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలోను అవకాశాలు దక్కించుకుని స్టార్ బ్యూటీగా మారిపోయింది. తర్వాత.. పలు సినిమాల్లో నటించి మెల్లమెల్లగా అవకాశాలు దక్కడంతో స్పెషల్ సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందులో భాగంగానే బన్నీ దేశముదురు సినిమాలోనూ.. అలాగే ఎన్టీఆర్ యమదొంగ సినిమాలోను స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. తర్వాత పలు సాంగ్స్ లో ఆకట్టుకున్నా.. మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీకి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఇక ఈ సినిమాలో తన నటనతో మరోసారి సత్తా చాటుకుంటే పునర్ వైభవం వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రంభ ఫ్యాన్స్ ఇండస్ట్రీలో మరోసారి సక్సస్‌లు అందుకుని దూసుకుపోవాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.