టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఆర్ సి 16 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు చిన్న గ్యాప్ కూడా లేకుండా శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఎక్కువ గ్రాఫిక్స్ తో పని లేకుండా షూటింగ్ వేగంగా జరిగిపోతుంది. ప్రస్తుతం లేట్ నైట్ షూటింగ్ జరుగుతుండగా.. రామ్ చరణ్ తో పాటు.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షెడ్యూల్ లో సందడి చేస్తుంది.
ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నుంచి శివరాజ్ కుమార్ కూడా సెట్స్ లో పాల్గొననున్నాడట. ఇలాంటి క్రమంలో ఆర్ సి 16 నుంచి ఒక క్రేజీ లీక్ నెటింట వైరల్ గా మారుతుంది. తాజాగా ఆర్ సి 16 సెట్స్ లో క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన షూట్ జరిగింది. షూటింగ్ సమయంలో ఎవరు తన మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో ఈ వీడియోను అప్లోడ్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరల్ గా మారుతుంది. చరణ్ ఎగ్రెసివ్గా క్రికెట్ ఆడుతూ కనిపించడం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక చెర్రీ సినిమా కోసం ఇంతలా కష్టపడితే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ ఫిక్స్ లెవెల్ లో ఉండడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా లీక్ అయిన వీడియోతో మూవీపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా.. మొదట ఈ సినిమాను ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. ఓటీటీ ఇష్యూ కారణంగా వచ్చేయడాది రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. తమ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టాడట. నెట్‌ఫ్లిక్స్ అయితే మూవీకి ప్రపంచవ్యాప్తంగా హైప్ వస్తుందని ఆయన అభిప్రాయం. ఇక నెట్‌ఫ్లిక్స్ ప్రెజెంట్ స్లాట్‌లు ఖాళీగా లేకపోవడంతో.. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని కోరారట. ఈ క్రమంలోనే చరణ్ కూడా వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేద్దాం అని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.