ఒకప్పటి టాలీవుడ్ ట్రెడిషనల్ హీరోయిన్ స్నేహకు ఇప్పటికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇండస్ట్రీలో ప్రేమించి వివాహం చేసుకున్న జంటల్లో స్నేహ, ప్రసన్నకుమార్ జంట కూడా ఒకటి. 2012 మే 11న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఎప్పటికీ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తమిళ్ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇక 2000 నుంచి 2020 వరకు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న స్నేహ.. దాదాపు అన్ని సినిమాల్లోనూ చుడిదార్, చీరలోనే హోమ్లీ లుక్ తో మెరిసింది. టాలీవుడ్‌లో సావిత్రి, సౌందర్య తర్వాత అంత పద్ధతి గల హీరోయిన్ అంటే స్నేహా అనే పేరు వినిపించేది. అలా ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో అమ్మడు కేవలం చీర కట్టుతో ఎక్స్పోజింగ్ లేకుండా నటించిన ఘనత దక్కించుకుంది. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే ప్రసన్నను ప్రేమించే వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. 2020లో ధనుష్ నటించిన పట్టాస్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే ప్రేగ్నెంట్గా మారింది.
తర్వాత ఇల్లు, పిల్లల బాధ్యతలను చూసుకుంటూ.. ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బిజీగా గడుపుతుంది. కాగా.. స్నేహ గతంలో తన భర్తతో కలిసొచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో తనకున్న సమస్య గురించి షేర్ చేసుకుంది. తనకు ఓసిడి ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ప్రసన్న కామెంట్స్ చేస్తూ.. అవును ఇల్లు అది బాలేదు, ఇది బాలేదు అంటూ మూడుసార్లు మార్చేసిందని. ఆమె మార్చుకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటరికల్ కామెంట్స్ వేసాడు. దానికి స్నేహ రియాక్ట్ అవుతూ నాకు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలి.. ముఖ్యంగా కిచెన్ క్లీన్‌గా కనిపించాలి. ఈ ఓసిడి సమస్య అరుదైనదే అయినా దాని గురించి అంతగా భయపడాల్సిన పనిలేదు. శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం అంతే అంటూ స్నేహ చెప్పుకొచ్చింది.