Tj రివ్యూ:’ దిల్ రూబా ‘ సారీ – థాంక్యూ మధ్య జరిగే పోరాటం..

టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం క సినమాతో మంచి సక్సెస్ అందుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడంతో.. కిరణ్ మార్కెట్, రేంజ్ కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే కిరణ్ నుంచి వచ్చే సినిమాలు పై ఆడియన్స్‌లో హైప్‌ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఆయన దిల్ రూబా అంటూ ఆడియన్స్‌ని పలకరించాడు. విశ్వకరుణ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రుక్సార్ థిల్లానా, ఖ్యాతి డేవిసన్ హీరోయిన్లుగా మెరిసారు. శివమ్‌ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన దిల్ రూబా.. హోలీ పండుగ (మార్చి 14) సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది.. కిరణ్ అబ్బ‌వరం సక్సెస్ అందుకున్నాడా.. లేదా.. రివ్యూలో చూద్దాం.

Dilruba Movie Review: దిల్ రూబా మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Dilruba Moive Review in Telugu: Kiran Abbavaram Mark Mass Entertainer - Telugu Filmibeat

కథ:
సిద్ధార్థ్ (కిరణ్ అబ్బవరం), మ్యాగీ (ఖ్యాతి డేవిసన్) ఇద్దరు చిన్నప్పటినుంచి కలిసే పెరుగుతారు. వీళ్ల‌ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. అయితే సడన్గా మ్యాగీ.. సిద్దుకి హ్యాండ్ ఇచ్చి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దీంతో సిద్దు చాలా కాలం కాలేజ్ మానేసి మరి బాధలో ఉండిపోతాడు. ఇలానే ఉంటే లాభం లేదని మ్యాగీ ఒత్తిడి పెంచడంతో తాను కూడా మారాలని ఫిక్స్ అవుతాడు. దానికోసం బెంగళూరు వెళ్లి అక్కడ ఎంఐటి కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇక‌ వెళ్లే రోజే ఓ పబ్‌లో అంజలి (రుక్సార్ థిల్లన్)ను రౌడీ నుంచి సేవ్ చేస్తాడు. దీంతో ఆమె సిద్దుకి ఫిదా అవుతుంది. కట్ చేస్తే.. అతను చేరిన కాలేజీలోనే అదే క్లాసులో అంజలి కూడా ఓ స్టూడెంట్‌గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఒకే బెంచ్మేట్స్‌. అప్పటి నుంచి అంజలి.. సిద్దు వెంట పడుతూ ఉంటుంది. తాను నో చెప్తాడు. కనీసం ట్రీట్ ఇస్తానన్నా కూడా వద్దంటాడు.

ఆయన కోసం ఏం చేయడానికైనా అంజలి సిద్దమవుతుంది. చివరికి వేశ్య‌గా రోడ్డుపై నిలబడడానికి కూడా ఓకే అంటుంది. దీంతో సిద్దు ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ.. ఆరోజు పబ్లో సిద్దు కొట్టిన రౌడీ కూడా ఇదే కాలేజీ స్టూడెంట్. వీరిద్దరూ ప్రేమించుకోవడం అసలు నచ్చని ఆ రౌడీ.. గొడ‌వ‌లుపెట్టి చివరకు వాళ్ళ‌ని విడగొడతాడు. వీళ్లిద్దరు విడిపోవడానికి సారీ, థ్యాంక్స్‌ పెద్ద అడ్డుగా నిలుస్తాయి. సిద్దు సారీ చెప్పడానికి అసలు ఇష్టపడడు. సారీ కాదు థాంక్స్ కూడా చెప్పానని చెప్తాడు. దీంతో అంజలి సిద్దుకి బ్రేకప్ చెప్పేస్తుంది. ఈ విషయం తెలిసిన సిద్దు మాజీ లవర్ మ్యాగీ వీళ్లిద్దరిని కలపడానికి అమెరికా నుంచి వస్తుంది. ఆమె ప్రెగ్నెంట్. తర్వాత ఏం జరిగింది..? అంజలి గురించి సిద్దు తెలుసుకున్న నిజాలు ఏంటి..? సిద్దు ఎందుకు సారీ, థాంక్స్ రెండు చెప్పడానికి ఇష్టపడడు..? అసలు మ్యాగీ, సిద్దు ఎలా విడిపోయారు..? అంజలి, సిద్దు చివరకు ఎలా కలుస్తారు..? కలవడానికి మ్యాగీ ఏం చేసింది..? సారీ, థాంక్స్ ఇప్పుడు ఎలా మిస్ యూజ్‌ అవుతునాయి..? అనేపాయింట్‌ సినిమాలో చూడాల్సిందే.

Dilruba Review: 'దిల్‌ రూబా' రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా | kiran-abbavaram-new-movie-dilruba-review

రివ్యూ:
కాలేజీ లవ్ స్టోరీ, గొడవలు కాన్సెప్ట్ అంతా ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం. సో కాస్త రొటీన్ గా అనిపించినా.. త‌న మాజీ ప్రియుడిని ప్రస్తుత ప్రియురాలితో కలిపేందుకు.. ప్రియురాలు తిరిగి రావడం.. ఆమె సపోర్ట్ అందించడం.. సినిమాల్లో కాస్త కొత్తగా అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్లు చూపిస్తాడు. అలానే.. ఇందులో సారీ, థాంక్స్ అనే పదాలను మిస్ యూస్ చేయకూడదని చెప్పే ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుత ఎక్కడ చూసినా ఈ రెండు పదాలు చాలా ఈజీగా వాడేస్తున్నారు. వాటి విలువ తెలియడం లేదు. కానీ వాటికి చాలా వాల్యూ ఉంటుందని తెలియజేశారు. పాయింట్ పరంగా కొత్తగా అనిపిస్తుంది. సినిమా నడిపించిన తీరు రెగ్యులర్ గా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ జనరేషన్ యూత్‌ను దృష్టిలో పెట్టుకుని సరికొత్తగా చూపించే ప్రయత్నాలు చేశారు.

కుర్రకారుకు కనెక్ట్ అయ్యేలా క్రేజీ లవ్ స్టోరీ గా రూపొందించారు. సినిమాలో తన ఫస్ట్ లవ్ హ్యాండ్ ఇవ్వడం.. పిచ్చోడైపోవడం, ఆ తర్వాత మూవ్ ఆన్ అవ్వడం కోసం మరో కాలేజ్ కి వెళ్లడం ఇవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. అయితే.. అక్కడ అంజలి లవ్ స్టోరీనే ప్రారంభంలో కాస్త కొత్త దానం కనిపించింది. మళ్లీ రొటీన్ స్టోరీ లోకి వెళ్ళిపోయింది. తను ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటున్నానని చెప్పే కథ బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓకె. కానీ సారీ చెప్పను అనడానికి బలమైన ఎమోషన్ చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హ‌ఫ్‌లో అమ్మాయి హీరో వెనక పడటం.. అత‌ను అవాయిడ్ చేయడం.. తర్వాత ఒక దశలో వారు ఇద్దరు కనెక్ట్ అవ్వడం.. ఒకరినొకరు ప్రేమించుకోవడం.. విలన్ విడకొట్టడం రోట్టిన్‌గా ఉన్న ఎంగేజింగ్‌గా అనిపించాయి.

Dil Ruba: జనవరి 3న "దిల్ రూబా" టీజర్ రిలీజ్ - Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

ఇంటర్వెల్ ఫైట్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. పెద్ద మాస్ హీరోల రేంజ్ లో ఈ ఫైట్ డిజైన్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న కారణం అంతే బలంగా డిజైన్ చేయాల్సింది. ఇక సెకండ్ హాఫ్‌లో హీరో.. మాజీ ప్రియురాలు వచ్చి ప్రస్తుత ప్రేమని కలపాలని ప్రయత్నం చేయడం కొత్తగా అనిపించింది. అదే టైంలో ఆ సీన్స్ ఫన్నీ గాను అనిపించాయి. అవి మరింతగా ఉంటే బాగుండేది. సత్య పాత్ర ఉన్నా.. కామెడీ పరంగా ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్ లో మరో విలన్ ఎంట్రీతో కథ‌ సరికొత్త మలుపు తిరిగింది. అదంతా కొంత రాంగ్ రూట్‌ అనిపించినా.. యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. కాకపోతే ఎపిసోడ్ మొత్తం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సారీ థాంక్స్ ల ప్రస్తావన రావడం అందుకు ప్రధాన కారణం. వాటి విలువను తెలియజేసిన తీరు బాగున్నా. అందరిని ఆలోచింపజేసేలా.. లవ్ లో డెప్త్ చూపించలేకపోయారన్న ఫీల్ వచ్చింది. మరోవైపు బలమైన ఎమోషన్స్ మిస్ చేశారు. సినిమాలో బిగ్గెస్ట్ ఎసెట్ మ్యూజిక్, ప్రేక్షకుల అందరినీ ఆలోచింపజేసేలా డైలాగ్స్ ఉన్నాయి.

నటీనటులు పర్ఫామెన్స్:
సిద్దు పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయినటించాడు. క‌ సినిమా నుంచి ఆయనలో వచ్చిన మార్పు ఈ సినిమాతో క్లియర్ గా కనిపించింది. ముఖ్యంగా లుక్ పరంగా ఆకట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సరికొత్త కిరణ్‌ను చూడొచ్చు. లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. నటనతోను మెప్పించాడు. త‌న పాత్ర పైనే సినిమా అంతా సాగింది. దీనికోసం కిరణ్ పడిన కష్టమంతా తెలుస్తుంది. ఈ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. అంజలి పాత్రలో రుక్సార్‌.. బబ్లీ యాక్షన్ తో ఆకట్టుకుంది. కనిపించినంత సేపు అందరి దృష్టి తనవైపే ఉండేలా చేసింది. మ్యాగీ పాత్రలో ఖ్యాతి.. ప్రెగ్నెంట్ ఉమెన్ గా కనిపించిన‌ కాసేపు అలరించింది. సత్య పాత్ర కామెడీ అందరిని నవ్వించింది. ఇంకా స‌త్య కామెడీ ఉంటే బాగుండేది అనిపించింది. ఇక అంజలీ తండ్రిగా ఆడుపాలెం నారాయణ మెప్పించాడు. ఆయన పాత్ర కొత్తగా కనిపించింది. మిగిలిన పాత్రలన్ని యావరేజ్.

దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం! | Tollywood Hero Kiran Abbavaram Gives Clarity On Dilruba Song Release Postpone, Tweet Goes Viral | Sakshi

టెక్నికల్ గా:
సినిమాకు మ్యూజిక్ హైలెట్. విజయ్ బుల్ గాని పాటలు ఆకట్టుకున్నయి. పెద్ద సినిమాల రేంజ్ లో బిజిఎం ఉంది. ముఖ్యంగా యాక్షన్లలో ఆర్ఆర్ ఆకట్టుకుంది. కొన్నిచోట్ల పూన‌కాలు తెప్పించే అంతలా మ్యూజిక్ డిజైన్ చేశారు. ఇక‌ డైలాగ్స్ మరో హైలెట్. ప్రతి ఆడియన్ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది. డేనియల్ విశ్వాస్ కలర్ ఫుల్ గా ప్రతిఫలం రూపొందించాడు. ఎడిటింగ్ పరంగా కాస్త ట్రిమ్ చేయాల్సింది. హార్ట్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్న సినిమా. ఇక డైరెక్టర్ విశ్వకరుణ్ రెగ్యులర్ కమర్షియల్ కథ‌ని కూడా ఏదో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సారీ, థ్యాంక్స్ అనే పాయింట్ల మధ్య జరిగే పోరాటం బాగుంది. ఆలోచింపచేసేలా సినిమా ఉంది. సినిమాను నడిపించిన తీరు కమర్షియల్ వే లోనే ఉండడం.. ప్రేమలో డబ్బు ఎమోషన్స్ కాస్త బలంగా చూపించాల్సింది.

చివరిగా: ఓ పక్క కమర్షియల్ లవ్ స్టోరీ. సారీ, థాంక్స్ విలువలు తెలియచెప్పే కథ.

రేటింగ్ : 3/5