టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువ వచ్చినా.. మంచి సక్సెస్ అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ జనరేషన్ మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్‌లో రేంజ్ సక్సస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించింది. హాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ దర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.
ఈ క్రమంలోనే స్టార్ దర్శకులు, నిర్మాతల నుంచి ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరు మల్టీ స్టారర్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దర్శకుడు తమను తమ స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలా టాలెంటెడ్ డైరెక్టర్‌గా తనని తాను నిరూపించుకున్న దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకడు. కల్కి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన నాగ అశ్విన్.. మరోసారి కల్కి సీక్వెల్ తో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన అశ్విన్.. ప్రభాస్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ సాధించాలని ప్రయత్నాల్లో ఉన్నాడట అశ్విన్. ఇక ఈ సినిమా తర్వాత ఓ స్ట్రాంగ్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడట అశ్విన్. ఇంతకీ.. ఈ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరోలు ఎవరనేది చెప్పలేదు. కానీ.. ఆయన మాత్రం మల్టీ స్టార్ చేయడం ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది.