టాలీవుడ్ నటుడు శివాజీ ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్ తో రాణించిన సంగతి తెలిసిందే. తర్వాత పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కావడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పాలిటిక్స్‌లోను సక్సెస్ అందుకోలేక రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టి అక్కడ మంచి లాభాలను అర్జించాడు. ఇక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే తరుణంలో.. బిగ్ బాస్ 7 అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. యశోద ద్వారా విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న శివన్న.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు.
బిగ్ బాస్‌కు ముందు.. తనునటించిన వెబ్ సిరీస్ 90స్ కిడ్స్ బిగ్ బాస్ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ చేయగా.. ఈ సిరీస్ ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈటీవీ విన్‌కు ఇది మొట్టమొదటి సక్సెస్. ఈ సిరీస్ తర్వాత.. శివాజీ పలు సినిమాలకు సైన్ చేసాడు. ఇందులో భాగంగానే ఆయన నటించిన మూవీ కోర్ట్ తాజాగా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. ఇక తాజాగా వేసిన ఈ ప్రీమియర్ షో నిర్మాత తో పాటు.. సినిమాకు సంబంధించిన నటీనటులు, మీడియా రిపోర్టర్స్, పాత్రికేయులు వచ్చి సందడి చేశారు. వాళ్ళ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక సినిమాకి మంగపతి క్యారెక్టర్ హైలెట్ అంటూ శివాజీ రోల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినిమా చూసిన జనం. ఇందులో ఆయన హీరోయిన్ బావ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో మెరిశాడు. తన పర్ఫామెన్స్‌కు స్కోప్ దొరికినప్పుడల్లా.. నటన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా ఈయన నటనపై ప్రశంసలు కురిసాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. నిర్మాతలు కూడా గతంలో ఈయన హీరోగా ఉన్న క్రమంలో.. తీసుకున్న రెమ్యూనరేషన్‌కు రెండింతలు ఇచ్చి మరి అవకాశాలను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.