మహాభారతం స్టోరీ సాధారణంగా వింటుంటేనే.. ఇంకా వినాలనిపించే కథ. ఒక్కోసారి స్టోరీలో వచ్చే ట్విస్టులు, ఎలివేషన్లు ఊహించుకుంటుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి.. అలాంటిది కథను వెండితెరపై భారీ గ్రాఫిక్స్. అద్భుతమైన విజువల్స్ తో చూపిస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక పాన్ ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని జక్కన వెల్లడించారు కూడా. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా మహాభారతాన్ని తెరకెక్కించాలని ఎప్పటినుంచ కలలు కన్నారు. గతంలోనే ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఇక అమీర్ ఖాన్ మూవీలని పర్ఫెక్షన్‌కు మారుపేరు. తన సినిమాల విషయంలో ప్రాణం పెట్టేస్తాడు. అలాంటిది తాను ఓ ప్రాజెక్ట్ పై ప్రకత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఇక దాని ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన మహాభారతం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం స్క్రిప్ట్ వరకు జరుగుతుందని.. పోరాటానికి సంబంధించిన కథ కనుక.. పరిశోధనలు జరుపుతున్నాం. సమాచారాన్ని స్వీకరించి ఇండియన్ ప్రేక్షకుల జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతమైన జ్ఞాపకంగా సినిమాను తీర్చిదిద్దుతాం. కచ్చితంగా అలాంటి కంటెంట్‌ను ఆడియన్స్ కు అందిస్తామని నమ్మకం ఉంది. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్స్ అఫీషియల్ గా ప్రకటిస్తామంటూ వివరించాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా అమీర్ ఖాన్ తన సహనటులు అయినా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లను ఓ సందర్భంలో కలిశాడు. దీనిపై తాజాగా ఇంటర్వ్యూవర్ ప్రశ్నకు.. మహాభారతంలో రోల్స్ కోసమే ఆ ఇద్దరు స్టార్ హీరోలను కలిసారా అని అడగగా.. అమీర్ ఖాన్ దానిపై రియాక్ట్ అవుతూ.. నాకు వాళ్ళిద్దరూ బాగా కావాల్సిన వాళ్ళు.. కలిసి కూడా చాలా రోజులైందని కలిసి వచ్చా. మీరు మా గురించి గాసిప్స్ ఎలా మాట్లాడుకుంటారో.. మేము మీ గురించి కాసేపు అలా మాట్లాడుకున్నాం. అంతేగాని.. సినిమాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదంటూ వివరించాడు. ఇక మహాభారతంలో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడు పాత్రలు కనిపించనున్నాడట. మిగిలిన పాత్రలు కూడా సూపర్ స్టార్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో అర్జునుడి పాత్ర కోసం చరణ్‌ను సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. అదేవిధంగా భీముడిగా సల్మాన్ ఖాన్, కర్ణుడిగా ప్రభాస్, భీష్ముడిగా అమితాబచ్చన్ ను నటింపజేయాలని ఆలోచనలో ఉన్నాడట. వచ్చేయడానికి చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని బాలీవుడ్లో టాక్ నడుస్తుంది.