టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత నటులు ఉదయ్ కిరణ్, స్టార్ హీరోయిన్ సౌందర్య పేర్లకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. కథలని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇక సౌందర్య అయితే తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో మెరిసింది. ఇక అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించి మెప్పించిన ఈ అమ్మడు.. బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఉదయ్ కిరణ్ తెలుగు తో పాటు.. తమిళ్‌లోను నటించాడు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు అందుకుని హ్యాట్రిక్స్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్‌లో సక్సెస్ అందుకున్న ఆయన.. మెల్లమెల్లగా ప్లాపులు ఎదురవడంతో ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నాడు. ఇలాంటి క్రమంలో ఉదయ్ కిరణ్ తన సొంత ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయినా సూసైడ్‌కు కారణం ఏంటో ఇప్పటివరకు తెలియలేదు. కాగా.. ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులు కలిసి ఓ సినిమాలో నటించారని.. చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ మూవీ ఏంటో..? ఆ వివరాలు ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం. ఆ మూవీ మరేదో కాదు సౌందర్య హీరోయిన్గా నటించిన నర్తనశాల.
ఇందులో ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి పనిచేశారు. ఈ సినిమా బాలకృష్ణ డైరెక్షన్‌లో రూపొందింది. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించగా.. ఉదయ్ కిరణ్ అభిమన్యుడి రోల్‌లో మెరిసారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే సౌందర్య ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఇదే సినిమాను ఎడిట్ చేసి 15 నిమిషాల ఫుటేజ్ మాత్రమే తీసుకొని.. 2020లో ఈటి అనే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఆ కట్ చేసిన క్లిప్‌లో ఉదయ్ కిరణ్ సీన్స్.. ఒకటి కూడా లేకపోవడం ఆశ్చర్యం. కానీ.. ఉదయ్ కిరణ్ కూడా ఈ సినిమా షూట్‌లో సౌందర్యతో కలిసి నటించారు.