అసలు ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత.. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే వస్తువులు, ఇల్లు, కార్లు ఇలా ప్రతి ఒక్క విషయంపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక సెలబ్రిటీస్ సైతం.. వాళ్లకు నచ్చిన, మెచ్చిన వస్తువులను తీసుకోవడానికి కోట్లల్లో సైతం ఖర్చుపెట్టడానికి వెనకాడరు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్.. వారు వాడే వస్తువుల కాస్ట్‌లు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతునే ఉంటాయి. అలా తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై అభిమానుల కన్నుపడింది. ఇంతకీ ఆ వాచ్ కాస్ట్ ఎంత ఉంటుందని సెర్చింగ్ మొదలుపెట్టారు.
ఇక ఆ వాచ్ విలువ తెలిస్తే ఖచ్చితంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తనకు నచ్చిన వస్తువుల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఇప్పటికే అలా తనకు నచ్చిన కోట్ల విలువ చేసే కార్లతో షెడ్ అంతా నింపేసిన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు విలువ చేసే ఎన్నో కార్లు ఉన్నాయి. అలా ఎన్టీఆర్‌కు కార్ల తర్వాత మరో నచ్చిన వస్తువు వాచ్. వాచ్‌లకు సైతం ఆయన కోట్లలో ఖర్చు పెట్టారు. గతంలో ఆయన రెండు కోట్ల విలువ చేసే వాచ్ పెట్టుకొని మీడియా కంటికి చిక్కాడు. ఆ ఫొటోస్ వైరల్ కావడంతో దాని కాస్ట్ తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అంతకు మించిన ఓ వాచ్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. తాజాగా వార్ 2 సినిమా షూట్లో పాల్గొని సందడి చేసిన తారక్.. తర్వాత ముంబై ఎయిర్పోర్ట్‌లో స్టైలిష్ లుక్ లో మెరిసాడు.
ఈ క్రమంలోనే ఆయన కొత్త లుక్‌కు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. కాగా.. ఈ పిక్స్ లో ఎన్టీఆర్ వాచ్ హైలెట్గా నిలిచింది. ఇంతకీ దీనికి కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా.. అక్షరాలా రూ.7 కోట్ల 47లక్షలట. సింపుల్ గా చెప్పాలంటే ఈ కాస్ట్ తో హైదరాబాద్‌లో ఓ పెద్ద బిల్లా అనే కొన్నేయొచ్చు. ప్రస్తుతం దీని విలువ తెలిసిన అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో చెప్పలేదు కదా.. ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ రీఛార్జ్ 40 – 01 టర్బైన్ మెకలర్.. స్పీడ్ టైల్ బ్రాండ్ కు చెందినది. ఈ వాచ్ విదేశాల నుండి ఎక్స్ ప్లోడ్ చేశారు. అన్ని పన్నులు చెల్లించిన తర్వాత.. దాదాపు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సమాచారం. అంతేకాదు.. ఈ వాచ్‌లు చాలా అరుదుగా దొరుకుతాయి. కేవలం ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్ వాచ్లు 106 మాత్రమే తయారు చేశారట. ఇక వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఉండడం విశేషం.