కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క దర్శకుడుగాను మంచి సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్‌లు అందుకుంటున్నడు. ఈ క్రమంలోని తాజాగా ఆయన మేనల్లుడిని హీరోగా పెట్టి తెరకెక్కించిన డ్రాగన్ సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కుబేర సినిమాలోని ఆయన నటిస్తున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరో పక్క.. బాలీవుడ్ లోనూ రంజనా సీక్వెల్లో ధనుష్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే.. తాజాగా మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు ధనుష్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ అందుకున్న అమరాన్ సినిమా డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇక రాజ్‌కుమార్ చివరిగా తెరకెక్కించిన అమరాన్ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్, రాజ్‌కుమార్ కాంబోపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. దీనిని డి55 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి తీసుకురానున్నరు. ఇక ఈ సినిమాను మధురై అన్బుచెళియన్ కూతురు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఇక మరో హైలెట్‌చ ఏంటంటే ఈ సినిమా కూడా ఓ బయోపిక్‌గా తెరకెక్కనుందట. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి నటినటుల వేటలో బిజీగా గడుపుతున్నారు. మరి ఈ సినిమా ఎవరి బయోపిక్‌గా వచ్చి.. ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను నెలకొల్పుతుందో వేచి చూడాలి.