కేవలం రూపాయి కోసం కి.మీ నడిచిన డైరెక్ట‌ర్.. ఇప్పుడు రూ. 325 కోట్ల అధిప‌తి.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, దర్శకులుగా రాణిస్తున్న వారందరూ ల‌గ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని.. పూల పాన్పుపై పవలిస్తారని అంతా భావిస్తారు. కానీ.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ సెలబ్రెటీస్‌గా రాణిస్తున్న చాలామంది.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించి.. కన్నీళ్లను తట్టుకొని.. ఆ స్టేజ్‌కు ఎదిగార‌ని చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ కూడా అదే కోవకు చెందుతారు. అతనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు కడుపేదరికానీ అనుభవించిన రోహిత్ శెట్టి.. తన అమ్మమ్మ దగ్గరే పెరిగారు.

Rohit Shetty - Wikipedia

ఇక వాళ్లది ఓ వెనకబడిన ప్రాంతం కావడంతో.. అక్కడ నుంచి ప్రతిరోజు పని పై అంధేరి.. లేదా మల్కాడ్‌కు వెళ్లడానికి 12 కిలోమీటర్లు వెళ్లవలసి వచ్చేది. అప్పట్లో 1 లేదా 2 రూపాయిలు ఆదా చేయడానికి.. అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడు. అలాంటి రోహిత్ శర్మ మొదట ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వ‌చ్చి.. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా కాలం ప‌నిచేశాడు. ఇక అజయ్ దేవగణ్ ఫస్ట్ మూవీ.. ఫుల్ ఔర్ కంటే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా రోహిత్ శ‌ర్మ వ్యవహరించాడు. అప్పుడు కేవలం తన వయసు 17 సంవత్సరాలు. ఇక రోహిత్ శ‌ర్మ‌ను డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా అజయ్ దేవగణ్‌కు దక్కుతుంది. 2003లో జమీన్ సినిమాతో రోహిత్ శెట్టికి అవకాశాన్ని ఇచ్చి ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

Rohit Shetty wraps 'Singham Again' with Ajay Devgn

ఇక తర్వాత సింగం, గోల్మాల్, చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ దర్శకుడుగా మారాడు. రియాలిటీ టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ప్రముఖ సంస్థ టైమ్స్ నౌ నివేదిక ప్రకారం.. రోహిత్ శెట్టి కెరీర్‌లో మొదట రూ.35 జీతంతో ప్రారంభించారు. అలాంటి రోహిత్ శెట్టి ప్రస్తుత నెల ఆదాయం రూ.3.5 కోట్లు. సంవత్సరానికి దాదాపు రూ.38 కోట్ల వరకు కూడబెడుతున్నాడు. ఒక్క సినిమాకు రూ.18 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. టీవీలోనూ మంచి పాపులారిటి దక్కించుకున్న రోహిత్ శెట్టి.. ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఇక కొన్ని నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోహిత్ శెట్టి నికర ఆస్తులు రూ.328 కోట్లకు పైగానే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఈ న్యూస్‌ వైరల్ గా మారడంతో ఒక్క రూపాయి ఖర్చుపెట్టడానికి ఆలోచించి కిలోమీటర్లు నడిచాడా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. రోహిత్ శెట్టి గతంలో ఇంత కష్టపడ్డాడు కాబ‌ట్టే.. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.