టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డికి తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు కృష్ణారెడ్డి. ఇక ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన శుభలగ్నం మూవీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. జగపతిబాబు, ఆమని, రోజా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఓ చిన్న పాయింట్‌తో మొదలైన కథ తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దివాకర్‌బాబు రచయితగా.. ఎస్వి. కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సెట్స్‌పైకి రావడం వెనుక మాత్రం పెద్ద కథ నడిచింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
దర్శక, నిర్మాతగా మంచి మీద క్రియేట్ చేసుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ మరో డైరెక్టర్ అనిల్ కుమార్.. ఓ రోజు రైటర్ దివాకర్ బాబుకు ఫోన్ చేసి తమను కలవాలని కోరారట. వెంటనే అక్కడికి వెళ్లిన దివాకర్ బాబుకు.. భూపతి రాజును పరిచయం చేసి ఆయన మీకు రెండు కథలు చెప్తారు.. మీకు ఏది నచ్చింది మాకు చెప్పండి అని అడిగారట.. వెంటనే భూపతి రాజు ఓ కథను పూర్తిగా వివరించారు. మరొక చిన్న పాయింట్‌ను మాత్రమే చెప్పారు. తర్వాత వీళ్ళిద్దరూ తిరిగివచ్చి దివాకర్ బాబును ఏ కథ నచ్చిందని అడగగా.. చిన్న పాయింట్ గా చెప్పిన కథ నాకు నచ్చిందని దివాకర్ వెల్లడించారు. అయితే వారు మాత్రం డీటెయిల్‌గా చెప్పిన కథ తమకు నచ్చిందని.. దాన్ని సినిమాలో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కథకు సంభాషణ రాయాలని దివాకర్ను కోరడం.. ఆయన ఓకే చెప్పడం అలా తెరకెక్కిన సినిమానే దొంగ రాస్కెల్.
అప్పటివరకు విలన్గా నటించిన శ్రీకాంత్.. ఈ సినిమాలో హీరోగా నటించి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక కొంతకాలానికి డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, అశ్వినీదత్‌తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. కథ కోసం వెతుకుతున్న క్రమంలో దివాకర్ ను పలకరించిన ఆయన.. మంచి కథ గురించి అడగగా.. భూపతి రాజు చెప్పిన భర్తను భార్య అమ్మసే పాయింట్ ఎస్వి కృష్ణారెడ్డికి.. దివాకర్ బాబు వివరించారు. ఆయనకు వెంటనే నచ్చడంతో విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్విని దత్‌కు వివరించగా భార్య.. భర్తను అమ్మేయడం నెగిటివ్ గా ఉంటుందని అశ్విని దత్ అనుమానించారట. అలా జరగకుండా కథ నీటిగా తీర్చిదిద్దుతానని దివాకర్ బాబు భరోసా ఇవ్వడంతో.. స్టోరీ రైట్స్‌ను అశ్వని దత్ కొనేశారు. దాన్ని డెవలప్ చేసి కథ రాయగా.. చివరకు అది శ్రీకృష్ణ తులాభారం స్టోరీ అయింది. సత్యభామ కట్టుకున్న భర్తను అమ్మకానికి పెడుతుంది.
ఇది కొత్త స్టోరీ ఏం కాదు. అయితే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మహిళలకు ఉండే ఆశలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. తాము అనుకున్నది జరగకపోయినా.. చేయలేకపోయినా.. మధ్య తరగతి మహిళలు మ్యానరిజం ఎలా ఉంటుందో.. ఆమని పాత్రకు జత చేశారు. అదే టైంలో తన పాత్రకు చిన్న అమాయకత్వాన్ని ఆపాదించి.. భర్తను అమ్మేసినా.. మళ్లీ భర్త, పిల్లలు కూడా ఇదే ప్యాలెస్ లో తనతో కలిసి ఉండాలని కోరుకునే మహిళగా.. పాత్రను డిజైన్ చేశారు. మనకు ఇచ్చిన దానికంటే ఎక్కువ అత్యాస పోతే ఏం జరుగుతుందో అనే దానికి అడాప్షన్ గా.. కళ్ళు వెళ్లిన ప్రతిచోటకు మనసు వెళ్ళకూడదు.. మనసు వెళ్లిన ప్రతిచోటకు మనిషి వెళ్ళకూడదు.. అనే డైలాగ్ ను ఆపాదించారు. అలా.. శుభలగ్నం సినిమా సెట్స్‌పైకి వచ్చి వెండితెరపై ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లకు కాసులు వర్షం కురిసింది.