టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. జంధ్యాల డైరెక్షన్‌లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చంటబ్బాయి ఇప్పటికి ఎంతమంది ఆడియన్స్‌కు గుర్తుండే ఉంటుంది. తనకున్న మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి.. చిరంజీవి చేసిన ఈ కొత్త ప్రయోగం అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక చిరు ఈ సినిమాలో విభిన్న గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. అందులో లేడీ గెటప్‌లోను ఆకట్టుకున్నాడు చిరంజీవి. గౌనుతో తలపై టోపీ పెట్టుకుని వయ్యారాలు వలకబోసాడు. అయితే చిరు ఈ లేడీ గెటప్ వెనుక చాలా పెద్ద స్టోరీని నడిపించిందట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు.
జంధ్యాల లేడీ గెటప్ గురించి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీలయ్యా.. కానీ మీసాలు తీసేయాలడంతో ఓ కండిషన్ పెట్టా. అప్పుడు సెట్‌లో మొత్తం 70 మంది వరకు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ మీసాలు తీసేస్తే చివరికి నేను మీసాలు తీస్తానని చెప్పా. వెంటనే సెట్స్‌లో పనిచేస్తున్న వాళ్లంతా మీసాలు తీసేశారు. ఇక ఆ లేడీ గెటప్‌లో మా ఫ్యామిలీ అయితే నన్ను చూడలేకపోయారంటూ వెల్లడించాడు. మీసాలు పెంచే వరకు కళ్ళ ముందు కనపడ్డొదు అన్నారని.. చిరంజీవి ఓ సందర్భంగా చంటబ్బాయికి సంబంధించిన క్రేజీ సంఘటనల గురించి వెల్లడించాడు.
కాగా ప్రస్తుతం చిరంజీవి బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా విశ్వంభర సినిమాన నటిస్తున్న సంగతి తెలిసిందే. వేసవి కానుకగా ఈ సినిమా ఆడియన్స్‌లో పలకరించింది. ఈ సినిమా తర్వాత సక్సెస్‌ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. పూర్తయిన వెంటనే చిరు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కథ వినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడెప్పుడు సెట్స్‌లోకి అడుగు పెడతాను అంటూ ఆసక్తిగా ఉందని.. చిరంజీవి వెల్లడించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.