థ‌మన్ కార్‌కు బాలయ్య పెయిమెంట్‌.. తెర వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

తాజాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్‌కు కార్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వరుసగా బాలయ్య సినిమాలుకు థ‌మ‌న్‌ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడంతోపాటు.. ఆయన సినిమాలకు బెస్ట్ అవుట్‌పుట్ తో బ్లాక్ బస్టర్‌లు అందించాడు. ఇక ఈ కార్ పెయిమెంట్ అకండ 2 నిర్మాతలు థ‌మన్‌కు చెల్లించినా.. బాలయ్య రెమ్యూనరేషన్ నుంచి ఈ మొత్తాన్ని మినహాయించనున్నారని టాక్ నడుస్తుంది. ఇక ప్రస్తుతం దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలా అందరి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ.. మిగతా వారికి గట్టి పోటీ ఇస్తున్న థ‌మన్ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారు.

Nandamuri Balakrishna Gifts Porsche Worth 1 Crore+ To Music Composer Thaman  S

దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే బాలయ్య.. థ‌మ‌న్ అభిమానులు.. వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలంటు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలయ్య ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలో అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా కోసం బాలయ్యకు.. ఏకంగా రూ.35 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.

Akhanda 2 - Thaandavam': Release date of Nandamuri Balakrishna's film with  Boyapati Sreenu announced - The Hindu

బాలయ్య మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ విషయంలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు.. కలెక్షన్ల పరంగా.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. సీనియర్ హీరోల సినిమాలు కలెక్షన్లు ఈ రేంజ్ సంచలనం అంటే అది సాధారణ విషయం కాదు. బాలయ్యకు మాత్రమే ఆ రికార్డు సొంతమైంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక బాలయ్య, థ‌మన్, బోయపాటి హ్యాట్రిక్‌ కాంబోలో రానున్న ఈ సినిమా ఏ రేంజ్‌లో బిజినెస్ జరుపుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.