ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించిన తర్వాత.. హీరోయిన్గా అవకాశాలు కొట్టేసి సినిమాలో నటించిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పావని రెడ్డి కూడా ఒకటి. మొదటి తెలుగులో పలు సీరియల్స్ నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వాత కోలీవుడ్‌లో పలు సీరియల్స్ లో నటిస్తూనే.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఆగా తెలుగులో పావని రెడ్డి.. చారి 111, డ్రీమ్, గౌరవం సినిమాల్లో మెరిసింది. తాజాగా.. ఈ ముద్దుగుమ్మ రెండో వివాహానికి సిద్ధమైందంటూ వార్తలు వినిపించాయి.
కొరియోగ్రాఫర్‌గా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న అమర్‌తో ఈమె రెండో వివాహం చేసుకొనుందట. ఈ నెల 20న వీరి వివాహం గ్రాండ్ లెవెల్‌లో జరగనున్నట్లు టాక్. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టా వేదికగా.. పావని రెడ్డి వెల్లడించింది. 2013లో పావని రెడ్డి మొదటి వివాహం చేసుకుంది. టాలీవుడ్ నటుడు ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకోగా.. తర్వాత కారణాలు తెలియవు కానీ.. 2017 లో ప్రదీప్ సూసైడ్ చేసుకుని తుది శ్వాస విడిచారు. ప్రదీప్ మరణానికి ముఖ్య కారణం పావని మరొకరితో క్లోజ్ గా ఉండడం వల్లే అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వాటి గురించి పావని ఎప్పుడు రియాక్ట్ కాలేదు, కాగా,, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుంది, తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని అక్కడ రనరప్‌గా నిలిచిన పావని.. అదే రియాలిటీషోలో పాల్గొన్నటువంటి మరో కంటెస్టెంట్ అమర్‌తో ప్రేమలో పడింది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి ఉంటున్నారని ప్రచారం కూడా తమిళ్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా పెళ్లి వార్తలతో.. వాటిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నరని తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఆమెను అభిమానించేవారు తనకు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెను నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు.