ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్ల మధ్య ఫ్రెండ్ షిప్ గాఢంగా ఉందని.. ఎఫైర్ నడుస్తుందని, ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ.. న్యూస్‌లు రావడం చాలా సహజం. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు అవస్తవాలు ఉన్న.. చాలావరకు అవి వాస్తవాలుగా మారుతాయి. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే చాలు ప్రతి ఒక్కరు తమకంటూ మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని తెగ ఆరాటపడతారు. అలా కుర్ర హీరోలు స్టార్ హీరోలుగా మారడానికి మంచి కథలను ఎంచుకుంటూ శ్రమిస్తూ ఉంటారు. అలా ఓ యంగ్ హీరో కెరీర్ మొదట్లో వరుసగా రెండుమూడు సినిమాలతో సక్సెస్ అందుకుని స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
అయితే ఇటీవల కాలంలో సరైన హీట్ లేక సతమౌతున్న ఈ హీరో ఇప్పుడు మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కాగా తన సినీ కెరీర్‌లో ఆయనతో కలిసి రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఓ పాన్ ఇండియన్ హీరోయిన్‌తో.. ఆ కుర్ర హీరో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే.. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆ హీరోయిన్ మాత్రం స్టార్ హీరోలో సినిమాల్లో నటిస్తూ.. పాన్ ఇండియన్ బ్యూటీగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. భారీ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరి దారిలో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. కాగా ఇద్దరికీ సమయం దొరికిన ప్రతిసారి వాళ్ళు ప్రేక్షకులను కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో కూడా ఈ జంట కలిసి ఉన్న కొన్ని ఫోటోలు, సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి తెగ వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఆరాటపడుతున్నారు. దీంతో.. దర్శక, నిర్మాతలు కూడా వీరిద్దరి కంబోలు సినిమాలు చేయాలని వెంటపడుతున్నారట. ఇంతకీ ఈ కుర్ర హీరో.. పాన్ ఇండియన్ హీరోయిన్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. ఈ కుర్ర హీరోకి వేరే లెవెల్లో క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. సక్సెస్ లేకపోయినా తన ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న ఈ కుర్ర హీరో.. ఆ పాన్ ఇండియన్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడా.. లేదా.. అనేది మాత్రం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.