RC16 కు స్మాల్ బ్రేక్.. టైటిల్ పై క్లారిటీ ఇదే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో ఎలాగైనా తను నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు సన్నాకు అవకాశం ఇచ్చాడు చెర్రీ. ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో సరవేగంగా సినిమా షూట్స్ పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నైట్ షెడ్యూల్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా సినిమా షూట్ మొత్తం పూర్తిచేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

RC16: Rumoured title revealed!

ఇక ఎటి పరిస్థితిలోనూ.. ఆర్‌సీ16 కు సంబంధించిన పనులన్నీ ఆగస్టులోపు పూర్తి చేసేసి సెప్టెంబర్ క‌ల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా షూట్‌కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తర్వాత స్కెడ్యూల్లో కీలక సన్నివేశాల కోసం.. సెట్ వర్క్‌లో బిజీగా ఉన్న టీం.. ఈ సెట్‌ వర్క్ పూర్తయిన వెంటనే.. సినిమా షూట్ ప్రారంభిస్తారు.

RC 16 To Progress In This Beautiful City | cinejosh.com

కాగా.. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ కోసం పరిశీలిస్తున్నారని.. ఎన్నో ట్యాగ్స్‌ను ఆలోచించిన టీం.. ఎట్టకేలకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. అయితే మేకర్స్ ఫిక్స్ అయిన ఆ టైటిల్ ఏంటో అనేది తెలియాలంటే మాత్రం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.