సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ బ్యూటీ సమంత అభినయం, అందం, స్టైల్ తో ఎప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. ఇక నటనలోనూ తనదైన మార్క్ చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యాషన్ ప్రపంచంలోను స్టైలిష్ ఐకాన్‌గా మెరిసింది. ఇక దాదాపు దశాబ్దం పాటు.. టాలీవుడ్‌ను ఏలేసిన ఈ అమ్మడు.. నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇక సామ్ టాలీవుడ్‌కి దూరమై.. రెండేళ్లు అవుతున్న ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటో షూట్స్, స్టిల్స్, ఇలా ఆమెకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయిన క్షణాల్లో వైరల్ అవుతూ.. లక్షల్లో లైకులు సంపాదించి పెడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్న ఫోటోషూట్ ఫిక్స్.. వైరల్‌గా మారుతున్నాయి. వైట్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఆమె స్టనింగ్ లుక్‌తో మెరిసింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూసి క్లాసిక్ అండ్ ఎలిగేంట్ అంటూ.. సో బ్యూటిఫుల్ అంటూ.. వెరీ నైస్ అంటూ.. రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ కు క్యాప్షన్ గా సెలెనా గోమేజ్ ఇటీవల రిలీజ్ చేసిన.. నిన్ను ప్రేమించాలంటే భయమేస్తుంది సాంగ్ లిరిక్స్ ను పంచుకుంది.
నువ్వు నా పక్కనే ఉంటావా.. ఎల్లప్పుడూ నా చేయి పట్టుకునే ఉంటావా.. అంటూ కామెంట్స్ ట్యాగ్ చేసింది. కాగా ఇటీవల సమంత, డైరెక్టర్ రాజ్ నిడమూరుతో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన క్యాప్షన్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొల్పోతుంది. నాగ చైతన్యను ప్రేమించి విఫలమైన సమంత ఈ క్రమంలోనే మరోసారి ప్రేమలో పడాలంటే ఇంతగా భయపడుతుందని.. అందుకే తాను ఇలాంటి క్యాప్షన్‌లు జోడించి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram