ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ స్టార్ బ్యూటీ.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయినా.. ఎంతమంది హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఒక్కసరైనా సక్సెస్ కూడా అందలేదు. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో మూడే మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. వాటిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు హీరో ఒకరే కావడం విశేషం. ఈ క్రమంలోనే అమ్మడు ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఆమె మరెవరో కాదు ప్రగ్యా జైశ్వాల్. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమాతో ఫ్లాప్ ని ఎదుర్కొంది. తర్వాత కంచె సినిమాలో హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా మంచి సక్సెస్ అరదుకోవడమే కాదు అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ.. ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కెరీర్ డెల్ అయ్యింది. ఇక ఫేడ్ అవుట్ అవుతుంది అనుకునే సమయానికి బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈమ్మడి దశ తిరిగింది. తర్వాత మరోసారి బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలోని నటించింది. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య అఖండ 2లోను హీరోయిన్గా నటించనుంది. ఇలా.. ప్రగ్యా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. కేవలం బాలయ్య సినిమాల సక్సస్‌తోనే నటిస్తూ కెరీర్ ను అలా లాగించేస్తుంది. బాలయ్య అఖండ ముందు వరకు ఎన్ని సినిమాల్లో నటించిన కంచె తప్ప ఒక్క సినిమాలోని ఆమెకు బ్లాక్ బస్టర్ దక్కలేదు. అలాంటిది ఇప్పుడు వరుసగా బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ మెల్లమెల్లగా అవకాశాలు వస్తున్నాయి.