టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య గురించి మాట్లాడాలంటే అఖండ కి ముందు అఖండ తర్వాత ఆయన క్రేజ్ గురించి మాట్లాడుకోవాలి. అఖండతో మొదలైన ఆయన సక్సెస్ ట్రాక్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్ ఫిక్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. మరో పక్క బుల్లితెరపై అన్‌స్టాపబుల్ షోతో తన ఇమేజ్ను మరింతగా పెంచుకుంటూ రాణిస్తున్న బాలయ్య ఈ షోతో యూత్‌ను మరింతగా కట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ షోకు ప్రొడ్యూసర్లుగా వివరిస్తున్న అల్లు ఫ్యామిలీతోనూ బాలయ్య బంధం మరింత బల్పడిందని చెప్పాలి. ఇక గతంలో బాలయ్య అల్లు ఫ్యామిలీ ల మధ్య వివాదాలు ఉండేవంటూ అంటూ ఎన్నో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య దీనిపై క్లారిటీ ఇచ్చారు. మా మధ్యన అలాంటివేమీ ఉండవు. మేము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో కలవలేకపోయాం.. అల్లు అర్జున్ నేను ఎంత క్లోజ్. అన్నపూర్ణ స్టూడియోస్లో మా ఇద్దరి సినిమా షూట్స్ పక్క పక్కనే జరిగేవి. నా షూట్ బ్రేక్ వచ్చినప్పుడు పుష్ప 2 సెట్స్‌లోకి వెళ్ళా. అప్పుడు సినిమా క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు. సుకుమార్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడం బదులు కత్తి చూపించా. వామో.. ఏంటి సార్ కత్తి చూపిస్తున్నారని సుకుమార్ భయపడుతూ అడిగాడు. పుష్ప 2 ఎన్ని రోజుల్లో తీస్తానని మాట ఇచ్చావు. మూడు నెలలు ఇప్పుడు ఎంత సమయం అయిందని సరదాగా బెదిరిస్తూ మాట్లాడా అంటూ బాలయ్య పుష్ప 2 సెట్స్‌లో జరిగిన సరదా సంభాషణలు ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక సుకుమార్ తన ప్రతి సినిమాను జక్కన్న లాగే ఏళ్లు తరబడి చెక్కుతూనే ఉంటాడు. దానికి పుష్ప 2 నిదర్శనం. ఏకంగా ఈ సినిమా షూట్ మూడేళ్ల సమయం పట్టింది. మొదటి పార్ట్ రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక కలిసి అన్‌స్టాపబుల్‌షోకి వెళ్లి సందడి చేశారు. ఇక సుకుమార్ అప్పుడు బాలయ్యకు చేసిన ప్రామిస్ అది. కాగా ప్రస్తుతం బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2లో నటిస్తున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25 దసరా కానుకగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా యంగ్ హీరో ఆది పిన్నిశెట్టి నటిస్తున్నాడు.