టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబుసనా డైరెక్షన్‌లో ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో చరణ్.. ఈ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా.. జాన్వి కపూర్ హీరోయిన్‌గా మెరవనుంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాయి. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా చరణ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది.
రామ్ చరణ్, నిఖిల్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందట. ఇక నిఖిల్ అనగానే.. పాన్ ఇండియన్ స్టార్ హీరో నిఖిల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇక్కడ అసలు టెస్ట్ ఏంటంటే.. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ డైరెక్షన్లో ఓ భారీ ప్రాజెక్టు సెట్స్ పైకి రానుందట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదుకాని ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో ఈ ప్రాజెక్టు పై ఆసక్తి నెలకొంది.