రజనీకాంత్ – చరణ్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. చిరంజీవినే కారణమా..?

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్‌ హీరో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో అవమానాలు, అహర్నిశలు శ్రమ తర్వాత.. టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు.వరుస‌ సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకుని.. మెగాస్టార్ బిరుదున్న సొంతం చేసుకున్నాడు. దీనికి కారణం తాను ఎంచుకునే కథలని చెప్పాలి. నటించే ప్రతి సినిమా విషయంలోనూ ఎంత శ్రద్ధ తీసుకునే.. చిరు వారసుడిగా రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఇక చిరుత సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు.

What happened to Ram Charan's movie Merupu? : r/tollywood

కాగా.. చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలో తను నటించబోయే కథలన్నీ చిరునే వినేవాడట. కథలు చిరంజీవికి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్ళెది. అలాంటి క్ర‌మంలోనే.. తమిల్ స్టార్ హీరో రజనీకాంత్, రామ్ చరణ్ కాంబోలో సినిమా మిస్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో పెద్దగా కాంఫ్లిక్ట్స్ లేకపోవడంతో.. స్టోరీ అటు రజినీకాంత్, ఇటు చ‌ర‌ణ్‌ ఇద్దరికీ సెట్ కాదనే ఉద్దేశ్యంతో.. చిరంజీవి ఈ సినిమాను క్యాన్సిల్ చేశాడని టాక్. ఆరెంజ్‌ సినిమా ప్లాప్ తర్వాత.. తమిళ్ డైరెక్టర్ ధరణితో చరణ్ మెరుపు సినిమా అనౌన్స్ చేసి సెట్స్‌ పైకి కూడా తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రజనీకాంత్ నటించనున్న‌ట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

Rajinikanth and chiranjeevi sale

కానీ.. సినిమా ఓవర్ బడ్జెట్ కావడం, అలాగే రజనీకాంత్ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో.. సినిమా పూర్తి కాకముందే చిరంజీవి క్యాన్సిల్ చేసేసాడట‌. ఈ క్రమంలోనే చరణ్ డేట్స్ అన్ని సంపత్ నందికి ఇచ్చేసి.. రచ్చ సినిమాను స్టార్ట్ చేయించాడట చిరు. ఇక సినిమా చరణ్‌కు మంచి మాస్ హీరో ఇమేజ్ను తెచ్చి పెట్టింది. అలా అప్పట్లో రజినీకాంత్, రామ్ చరణ్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అవ్వడానికి చిరంజీవి కారణమయ్యడట‌. ఇక చిరు ఈ ప్రాజెక్ట్ ఆపేసి మంచి పని చేశాడని.. తర్వాత పలువురు సినీ మేధావులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కారణం.. ఈ సినిమాకు ముందే చరణ్ ఆరెంజ్‌ సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా డిజాస్టర్ ఎదుర్కొంది. దీనికి తీవ్రమైన నష్టాలు రావడంతో అలాంటి నష్టాలు మరే ప్రొడ్యూసర్‌కు మిగలకూడదని ఉద్దేశంతో చిరు అలాంటి నిర్ణయం తీసుకున్నారట‌.