సాయి ప‌ల్ల‌విని ప‌బ్లిక్‌లో కిస్ చేసిన డై హార్ట్ ఫ్యాన్‌.. షాకింగ్ వీడియో..

తాజాగా నాగచైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన మూవీ తండేల్‌ సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి తెర‌కెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామ ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ ద‌క్కించుకుంది. పరజ‌యాలతో.. డీల పడిపోయిన చైతుకు స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడమే కాదు.. చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లు దాటేయడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ ద్వారా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ తండేల్‌ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవ‌హ‌రించ‌గా.. డిఎస్పి మ్యూజిక్ అందించాడు.

Team #thandel celebrated sai pallavi winning 6 filmfare's And becoming the only actress to achieve so #saipallavi #trending #reels #funny #explorepage #explore #exploremore #filmfare #ranbirkapoor

ఈ సినిమాలో సాయి పల్లవి తన అద్భుత న‌ట‌న‌తో మరోసారి ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటన నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సాయి పల్లవిని ఓ డై హార్ట్‌ ఫ్యాన్.. ముద్దు పెట్టుకుంటున్న క్యూట్ వీడియో ట్రెండ్‌ అవుతుంది. ఓ మహిళ అభిమాని సాయి పల్లవి దగ్గరికి వచ్చి ఆమెతో సెల్ఫీ దిగడమే కాదు.. తనను ముద్దు పెట్టుకుంటానంటూ క్యూట్ గా అడిగి మరి సాయి పల్లవి చేతిపై ముద్దు పెట్టి వెళ్ళింది. ఇక ఈ సదరు వీడియోకు భాష మూవీ లోని రజినీకాంత్ వీడియోను కలిపి.. మరో రేంజ్‌లో అమ్మడిని ఎలివేట్ చేస్తూ వీడియోను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు.

Ready for 'Tandel's New Song Promo? Here's When!"

సాయి పల్లవి హీరోలకు సమానమైన ఫేమ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమెను దేవతల ఆరాధిస్తారు చాలామంది ఫ్యాన్స్. తమిళ్ కంటే సాయి పల్లవికి తెలుగులోనే ఎక్కువ మొత్తంలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. దానికి కారణం కేవలం ఆమె నటన టాలెంట్ మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, ఎంచుకునే పాత్రలు, డి గ్లామరస్ పాత్రలో నటిస్తూ సాంప్రదాయబద్ధంగా మెరవడం. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. తనకు నచ్చకపోతే ఆమె నో చెప్పె వ్యక్తిత్వం. అంతేకాదు సాయి పల్లవి ఎలాంటి యాడ్స్‌లోనూ నటించదు. నేను నమ్మని విషయాలపై.. నేను ఎప్పటికీ ప్రచారం చేయన‌ని సాయి పల్లవి పలు సందర్భాల్లో వెల్లడించింది.