చిరు విశ్వంభ‌ర‌లో ఆ మెగా హీరోయినా డ్యాన్స్‌.. ఇదెక్క‌డి అరాచ‌కం రా సామి..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ వ‌శిష్ట‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూట్‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు చిరు. ఇక దాదాపు షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫైనల్ సాంగ్‌గా చిరు ఇంట్ర‌డెక్ష‌న్ సాంగ్‌ షూట్ బిజీబిజీగా సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాల్లో చిరంజీవి సరిసన మెగా హీరోయిన్ చిందేయ‌నుందంటూ టాక్‌ నడుస్తుంది. ఇంతకీ అమ్మే మరెవరో కాదు.. మెగా డాట‌ర్ నిహారిక.

Sai Dharam Tej rubbishes rumours of marriage with Niharika Konidela - India  Today

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ప్రస్తుతం ఫుల్ జోష్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ ప్రొడ్యూసర్‌గా బిజీబిజీగా గడుపుతున్నా ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చిరు సినిమాలో భాగం కాబోతుంది అంటూ టాక్‌ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ సినిమాల్లో చిందేయపోతుందట. ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ సెట్స్‌లో అడుగుపెట్టడంటూ వార్తలు వినిపించాయి. ఇందులో అతడు గోస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇక ఇప్పుడు.. మెగా డాటర్ కూడా ఈ ప్రాజెక్టులో కాలు పెట్టిందని తెలుస్తుంది. ఈ మూవీలో.. ఓ సాంగ్ కోసం.. చిరంజీవితో కలిసి చిందేయబోతుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్న ఇంట్రడక్షన్ సాంగ్‌లో నిహారిక తన డాన్స్ స్టెప్స్ తో మెస్మ‌రైజ్‌ చేయనుందని.. గ‌త శనివారం సాయి ధరంతేజ్ సెట్స్‌లో సందడి చేయగా.. అదే సాంగ్లో నిహారిక కనిపించనుందట. అత్యంత గ్రాండ్ లెవెల్లో ఈ ఇంట్రడక్షన్ సాంగ్ రూపొందించనున్నారని ఇందులో.. ప్రస్తుతం ఉన్న మెగా హీరోస్ అంతా స్పెషల్ రోల్స్ లో క‌నిపించ‌నున్నారని టాక్‌ నడుస్తుంది. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.