రాజమౌళి అమ్మగారికి చిరంజీవికి మధ్యన బంధుత్వం ఉందా.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ మెగాస్టార్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరంజీవి.. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత.. సక్సెస్ అందుకున్న చిరు.. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దాదాపు పదేళ్లు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికి అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు.

ఆయన మంచి రైటర్. ఇప్ప‌టికే ఎన్నో హిట్ సినిమాల‌కు క‌థ‌లు అందించారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన ఇంటర్వ్యూలో పాల్గొన్ని సందడి చేశాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన భార్య, చిరంజీవి కుటుంబాలకు మధ్య ఉన్న బ్యాక్ గ్రౌండ్ గురించి వెల్లడించాడు. రాజమౌళిది ప్రేమ వివాహం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నరట. ఆయన కమ్మ‌ వర్గానికి చెందిన వారు కాగా.. విజయేంద్ర ప్రసాద్ భార్య రాజ నందిని కాపు వర్గానికి చెందిన మహిళ అని.. ఈ విషయం ఆయనకు పెళైన చాలా రోజుల వరకు తెలియదని సినిమా ప్రమోషన్స్ లో వెల్లడించాడు.

RRR writer V Vijayendra Prasad: 'I steal stories from everywhere' | Telugu  News - The Indian Express

ఖైదీ సినిమా సూపర్ హిట్ అయిన టైంలో.. ఆవిడ మా చిరంజీవి, మా చిరంజీవి.. అదరగొట్టేసాడు అంటూ అంటుండేదని.. దీంతో మీకు చిరంజీవి ఏమైనా బంధువా అని నేను ఆమెను అడిగానంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. దానికి ఆమె.. కాదు, చిరంజీవి కూడా మా వాళ్లే అంటూ సమాధానం ఇచ్చిందని.. ఇక చిరంజీవికి ఆమె చాలా పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తమ ఫ్యామిలీలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నారని.. అది కూడా కులాంతర వివాహాలే అంటూ వెల్లడించారు.