50 వేల కోట్ల ఆస్తి ఉన్న ఈ హీరో చాలా సింపుల్.. కారణం అదేనా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి ఒకటి రెండు సక్సెస్‌లు వస్తే చాలు.. వాళ్ళు రేంజ్‌ పూర్తిగా మారిపోయినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన.. కోట్ల ఆస్తిని కూడబెట్టుకున్న.. సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారు. అలాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చాలా మంది ఉన్నారు. వాళంతా డౌన్ టు ఎర్త్ అనే ఫార్ములాను ఫాలో అవుతారు. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ ఇలాంటి నటులు కొంతమంది ఉన్నారు. వారిలో స్టార్ హీరో, విలన్ గాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సైఫ్ అలీఖాన్ ఒకడు.

ఆయన పటౌడి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అంటే రాజుల కుటుంబం. అయినా ఇప్పటికే సింపుల్ లైఫ్ ఇష్టపడతాడు. ఒకప్పుడు హీరోగా రాణించిన సైఫ్‌.. ప్రస్తుతం విలన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఆయ‌న ఇంట్లో దొంగలు చొరబడి.. అతనిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి అంత పెద్ద ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డాడు. దాదాపు రూ.50 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్న సైఫ్ మాత్రం సింపుల్ లైఫ్ ఇష్టపడతాడు.

ఈ క్రమంలోనే పటౌడి ఫ్యామిలీ అంటే అంత గౌరవిస్తారు. ఇక దేవర సినిమాలో తన వెలనిజంతో ఆకట్టుకున్న సైఫ్‌.. ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాల అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ.. ఇలాంటి క్రమంలో అతనిపై దాడి జరగడం, కొద్ది రోజులపాటు లాంగ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సజెస్ట్ చేయడంతో.. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఏదేమైనా సైఫ్ లాంటి నటుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన సింప్లిసిటీ, ఆయన వ్యక్తిత్వం ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఇక ఆయనలోని ఈ డౌన్ టు ఎర్త్ గుణమే మరింత మంది అభిమానాన్ని తెచ్చిపెడుతుంది.