టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఓజి సినిమాలతో వరుస షెడ్యూల్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టుల షూటింగ్‌లలో సందడి చేస్తున్నాడు. ఇద్దరు టాప్ మోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలతో నటించాలన్నదే నా కోరిక అంటూ టాలీవుడ్ లో.. ఎంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తన కోరికను వెళ్లబుచ్చింది.
ఈ క్రమంలోనే మృణాల్‌కు అస్సలు ఆ అవకాశం ఉండదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృణాల్ ఇప్పటివరకు నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోల సరసన నటించి మంచి సక్సెస్ అందుకుంది. అమ్మడి నటనకు కూడా ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు.. ఆమె క్రేజ్ మరొక మెట్టు ఎదగాలంటే పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, చరణ్, మహేష్, బన్నీ, పవన్ లాంటి హీరోలతోనూ అవకాశాలు దక్కించుకొని నటించాలి. ఇలాంటి క్రమంలో మృణాల్ ఠాగూర్ మాట్లాడుతూ.. పవన్, ఎన్టీఆర్ సరసన అవకాశాలు వస్తే నటించాలని ఉందంటూ వెల్లడించింది.
కాగా ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం వాళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్ రిత్యా.. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాల్లోనూ మృణాల్‌కు అవకాశం రావడం చాలా కష్టం. ఆమెను హీరోయిన్గా తీసుకోవాలంటే ఎన్నో విషయాలపై టెస్ట్ చేసిన తర్వాతే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అడవి శేష్ డెకయిట్ సినిమా తప్ప.. మరో ఛాన్స్ అమ్మడి చేతిలో లేదు. ఈ క్రమంలో తనకు పెద్ద స్టార్ హీరోలు అవకాశాలు కల్పిస్తారని ఆశ భవాని వ్యక్తం చేస్తుంది. కానీ.. ఆమె అనుకున్నది ఇప్పట్లో జరగడం చాలా కష్టమే. ఇక ఫ్యూచర్లో అయినా వారిద్దరి సరసన మృనాల్ ఠాగూర్ నటించగలుగుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.