ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బక్క పల్చని కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియన్ ఫేమస్ నటుడు. కేవలం తన నటించిన ఒకే ఒక్క సినిమాతో పాపులర్ నటుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా నటిస్తూనే.. విలన్‌గా మారి మెప్పించిన ఈ కుర్రాడు.. నిర్మాతగాను తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు తన నటనకు ఏకంగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయంటే.. అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక పేద్దింటి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. పదో తరగతి వరకు ఎంతో కష్టపడి చదువుకునే టాపర్‌గా నిలిచాడు. తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటి టాప్ మోస్ట్ కంపెనీగా క్రేజ్‌ను సంపాదించుకున్న ఇన్ఫోసిస్‌లో జాబ్ కొట్టేసాడు. అయితే తనకు నటనపై ఉన్న ఆసక్తితో అంత మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. థియేటర్ రంగంలో కోర్స్ ను కంప్లీట్ చేసి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీగా ఎదిగాడు.
ఇంతకీ అతను ఎవరో గుర్తుపట్టారా.. కాస్త కష్టమేలెండి మేమే చెప్పేస్తాం. అతనే పుష్ప విలను జాలిరెడ్డి. అసలు పేరు డాలి ధనుంజయ్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన డాలి.. ధన్యత అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక డాలీ ధనుంజయ్ మ్యారేజ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులతో పాటు.. నేటిజన్స్ ఫ్యాన్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు ఓ లుక్ వేసెయండి.