ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కావాలని.. నటీనట్లుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అడుగు పెడుతుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా అతి చిన్న వయసులో అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. అతనే మాస్టర్ భాను ప్రకాష్. పేరు చెప్తే టక్కును గుర్తుకు రాకపోవచ్చు.. ఫోటో చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇక భాను ప్రకాష్ కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకొని మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా తండేల్ సినిమాలను అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం సెవెన్త్ క్లాస్ చదువుతున్న ఈ కుర్రోడు.. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భాను ప్రకాష్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులను ఫిదా చేశాడు. ఈ క్రమంలోనే భాను ప్రకాష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఇంతకీ అసలు భాను ప్రకాష్ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. భాను ప్రకాష్‌ను ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కదా.. భవిష్యత్తులో స్టార్ హీరో రేంజ్‌కు ఎదగాలనుకుంటే మీరు ఏ హీరో నుంచి ఏక్వాలిటీ తీసుకుంటారు అని ప్రశ్నించగా.. భాను ప్రకాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.
ఎన్టీఆర్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు.. ఆర్‌ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేసిన బియాండ్ స్టోరీ నేను చూశా. ఆయన ఎంత డెడికేటెడ్‌గా పనిచేశారు అర్థమైంది. ఒక సీన్ చాలు ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతారో చెప్పడానికి.. ఒక పాత్రకి ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి డబల్ కష్టం ఆయన చూపిస్తారు. ముఖ్యంగా ఆయన బేస్ వాయిస్‌కు నేను పెద్ద ఫ్యాన్. ఇక ఎన్టీఆర్ నుంచి వాయిస్ తో టీజర్ వచ్చిందంటే ఆ టీజర్ కచ్చితంగా సక్సెస్ అయినట్లే.. ఆయన వాయిస్ వింటూ ఉంటే ఎంత డెప్త్ గా వెళ్ళిపోతామో అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భాను ప్రకాష్ చేసిన ఆ సింగిల్ కామెంట్‌కు తారక్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.