ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. సినిమా సక్సెస్ అయితే మళ్లీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వరకు చాలామంది ఇండస్ట్రీలో ఓ సినిమా వస్తుందంటే లక్కీ సెంటిమెంట్‌ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని భావిస్తారు. అదే విషయాన్ని ఇప్పుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు. తనకు సెంటిమెంట్స్ ఉండవని చెప్తూనే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను ఫాలో అవుతున్న ఏకైక సెంటిమెంట్ ఇదేనంటూ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్ చేశాడు. ఇండస్ట్రీలోనే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేని డైరెక్టర్గా అనీల్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్‌గా వెళ్ళిపోయారు వినిపిస్తుంది.
అందులోను తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి ముందు వరకు కూడా అనిల్ రావిపూడి సక్సెస్ సెంటిమెంట్ ఏంటి అంటే ఏమీ లేదన్న సమాధానం వినిపించేది. కానీ.. ఇప్పుడు మాత్రం ఏదో లక్కీ సెంటిమెంట్ ఉండే ఉంటుందంటూ పటాస్‌తో సినిమా జర్నీ స్టార్ట్ చేసిన సక్సస్ కెప్టెన్ కామెంట్స్ చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తను తెరకెక్కించబోయే ప్రతి సినిమా కథను మానుకోటలోనే రాసుకుంటానని వివరించాడు.
ఫస్ట్ హఫ్ పూర్తయ్యాక అక్కడి నుంచి మరి ఎక్కడికైనా కదులుతానని.. ఏ సినిమాలో హీరో అయినా ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదైనా.. కచ్చితంగా మానుకోటలో మాత్రం కథ రాయడం మొదలు పెట్టాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు సీనియర్ స్టార్ హీరోస్ బాలయ్య, వెంకీలకు ది బెస్ట్ హిట్ సినిమాలను ఇచ్చిన ఈ యంగ్ కెప్టెన్.. ఇప్పుడు మెగాస్టార్ మూవీస్క్రిప్ట్ కోసం మరోసారి మానుకోట వెళ్లాను అన్నాడు. రైటింగ్ పరంగానే కాదు.. స్క్రీన్ ప్రజెంట్ పరంగాను అనిల్ రావిపూడి ఆ లక్కీ సెంటిమెంట్‌ను ఫాలో అవుతాడు. తను తెరకెక్కించే ప్రతి సినిమాలో ఏదో చిన్న కామియో రోల్ అపీరియన్స్ ఇస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇదే అనిల్ సినిమా కెరియర్ లో ఆయన ఫాలో అయ్యే డబ్బులు సక్సెస్ సెంటిమెంట్స్ అట.