మరోసారి గురుజిపై విరుచుకుపడ్డ పూనమ్ కౌర్.. షాకింగ్ కౌంటర్

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూన‌మ్ కౌర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ అమ్మడు ఇటీవ‌ల కాలంలో సినిమాల కంటే కాంట్ర వ‌ర్సీల‌తో ఎక్కువ‌గా హైలెట్ అవుతుంది. ఇక ఎప్పటికప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్‌పై కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది. వీరిద్దరి మధ్యన అసలు వివాదం ఏంటో తెలియదు గానీ.. ఏదో పెద్ద గొడవే ఉందంటూ హాట్ టాపిక్ గా వీళ్ళ‌ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే దీని వెనుక అసలు కారణం త్రివిక్రమ్, పూనమ్‌కు అవకాశాలు ఇస్తానని మోసం చేయడమే అంటూ.. వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తనకు జరిగిన అన్యాయంపై రియాక్ట్ అవుతూనే ఉంటుంది.

Poonam Kaur to make her Bollywood debut opposite Karan Singh Grover in 3 Dev

అంతేకాకుండా మా అసోసియేష‌న్‌కు కంప్లైంట్ చేసినట్లు వివరించింది. టైం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్‌పై పరోక్షంగా కౌంటర్లు వేస్తూనే ఉండే ఈ అమ్మడు.. గతంలో పవన్, త్రివిక్రమ్ ఇద్దరి పైన రకరకాలుగా కౌంటర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేయడం తగ్గించిన పూన‌మ్.. త్రివిక్రమ్‌పై మాత్రం డైరెక్ట్‌గానే కౌంటర్లు వేస్తూ వస్తుంది. ఆయనని గురూజీ అని సంబోధిస్తూ.. ఎప్పుడు ఏదో ఒక కాంట‌ట్ర‌వ‌ర్సీ కామెంట్ చేస్తునే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఆమె ఇన్ని కామెంట్స్ చేసిన ఎప్పుడు ఈ విషయంపై కూడా త్రివిక్రమ్ రియాక్ట్ కాలేదు.

Poonam Kaur – Trivikram | త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై కంప్ల‌యింట్ ఇచ్చిన  పట్టించుకోలేదు : పూనం కౌర్-Namasthe Telangana

ఇక ఈ విషయంపై త్రివిక్రంను డైరెక్ట్‌గా ప్రశ్నించే సాహసం కూడా ఎవరూ చేయలేదు. కాగా.. ఇటీవల ఓ ఇంగ్లీష్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ గురించి నెటిజ‌న్స్‌ మాట్లాడుతుండగా.. ఈ సీన్‌ని మా గురూజీ ఉన్నది ఉన్నట్లుగా లేపేసాడు అంటూ.. నవ్వుతూ కౌంటర్ వేసేసింది పూనమ్‌. త్రివిక్ర‌మ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో సమంత కారులోనే దుస్తులను మార్చుకునే సన్నివేశం హాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ తీసుకువచ్చినట్లుగా.. ఈ సన్నివేశం గురించి ఆమె కామెంట్లు చేసినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ తన పాత సినిమాలన్నీ కూడా కాపీనే అంటూ.. ఎన్నో సందర్భాల్లో వార్తలు వినిపించాయి. కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ నుంచి కాపీ చేశారని.. కామెడీ ట్రాకులన్నీ హాలీవుడ్ నుంచి తీసుకునవే అని ఎన్నో సందర్భాల్లో టాక్ నడిచింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిప్పిస్తుంది.