1980,90లలో స్టార్ హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోయిన వారిలో హీరో సుమన్ ఒకడు. బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలకు సరి సమానంగాఫేమ్ సంపాదించుకున్న సుమన్.. కెరీర్లో చోటు చేసుకున్న కొన్ని సంచలన పరిణామాలతో ఇండస్ట్రీలో ఆయన జోరుకు బ్రేక్ పడింది. బ్లూ ఫిలిమ్స్ కేసులో ఆయన చిక్కు కోవడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. అప్పట్లో సుమన్ అందంతో అమ్మాయిలను.. ఫ్యామిలీ సన్నివేశాలతో, యాక్షన్స్ సన్నివేశాలతో మాస్, క్లాస్ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సుమన్‌ని స్టార్ హీరో అవ్వకుండా ఎలాగైనా ఇండస్ట్రీలో తొక్కేయాలని కావాలనే ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రెటీస్, రాజకీయ నాయకులు పగడ్బందీగా ప్లాన్ చేసి ఆయనను ఇరికిచ్చారని.. సినీ కెరీర్ అన్న నాశనం చేశారంటూ ఎన్నో పుకార్లు వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలోనే ఓ సీఎం కారణంగా సుమన్ ఆ వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సీఎం ఎవరు.. అసలు సుమన్, ఆ సీఎంకు ఉన్న సంబంధమేంటి.. మెగాస్టార్ పేరు ఎందుకు బయటకు వినిపించిందో ఒకసారి చూద్దాం. వీటన్నిటిపై సుమన్ క్లోజ్ ఫ్రెండ్ అయినా సాగర్ క్లారిటీ ఇచ్చారు. సాగర్ మాట్లాడుతూ.. సుమన్ బ్లూ ఫిలిం కేసులో సాక్షాత్తు తమిళ్ సిఎం ఎంజీఆర్‌కు తెలిసే ఈ విషయం అంత జరిగిందని వెల్లడించాడు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉండగా.. రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంటాక్ట్లలో ఒకరైన వడయార్ కారణంగానే సుమన్ జైలు పాలయ్యాడని.. పక్క ప్లాన్ తో సుమన్ కి బెయిల్ రాకుండా కేసు పెట్టి లోనకు తోసారని.. అది కూడా ఒక అమ్మాయి సుమన్ పైన మనసు పడటం వల్లే జరిగిందంటూ వెల్లడించారు.
అప్పట్లో తమిళనాడు డిజిపి కూతురు సుమన్ వెంటపడేదట. ఆ అమ్మాయికి వివాహం కూడా అయింది. అయినా సరే సుమన్ షూటింగ్ జరుగుతుందంటే.. అక్కడ ఎక్కువగా కనిపించేది. సుమన్‌కు ఆమెపై ఎలా ఎలాంటి అభిప్రాయం లేదు. ఆ టైంలో కాంట్రాక్టర్ వడియార్ కూతుర్ని సైతం.. సుమన్ స్నేహితులలో ఒకరు ప్రేమించాడట. ఇలా సుమన్ కి అన్ని కూడా వ్యతిరేకంగా జరగడంతో.. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందట. ఈ విషయంపై సుమన్‌ను ఆయన మందలించేందుకు ప్రయత్నిమచటంతో.. అసలు నా తప్పేమీ లేదని సుమంత్ తెల్చి చెప్పాడట. కానీ.. సుమన్ చేసిన కామెంట్స్ నిర్లక్ష్యంగా భావించిన ఎంజీఆర్ సుమన్ పై అల్లర్ల కేసు పెట్టడమే కాకుండా.. బ్లూ ఫిలిం కేసులు కూడా బనయించినట్లు టాక్ నడిచింది. అయితే దీనిపై సాగర్ రియాక్ట్ అవుతూ.. అక్కడ అసలు విషయంపై కేసు పెట్టలేదని.. తప్పుడు కేసులు సుమన్ పై బనాయించి నెలల పాటు జైల్లో ఉంచారని సాగర్ చెప్పుకొచ్చాడు. సుమన్ అమ్మకి గవర్నర్ బాగా తెలియడంతో.. బెయిల్ మీద బయటకు వచ్చాడని.. అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఉన్నారనేది కేవలం పుకారు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు.