ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేసిన చరణ్.. అసలు ఈ మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతుంది..?

గతంలో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కొంతకాలం ఈ వివాదాలు సర్దుమనిగాయంటూ టాక్ నడిచినా.. కొద్ది రోజుల నుంచి మరోసారి వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ గాని అల్లు అరవింద్ కానీ ఈ వివాదాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం.. కొన్ని ఈవెంట్లో ఈ తండ్రీ, కొడుకులు చేసిన హాట్ కామెంట్స్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించినట్లే అనిపించడంతో.. మెగా ఫ్యాన్స్ మండిప‌డ్డారు. ఇటీవ‌ల తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అల్లు అరవింద్ గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్‌పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్‌ను విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు.

Ram Charan (@alwaysramcharan) • Instagram photos and videos

ఈ గొడవ తారా స్థాయికి చేరడంతో.. అల్లు అరవింద్ రీసెంట్‌గా జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్స్ నేను చేయలేదని.. కేవలం దిల్ రాజును ఉద్దేశించి చేసిన కామెంట్స్ కు ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే సారీ అంటూ వివరించాడు. అంతేకాదు చిరంజీవి కూడా ఇటీవల జరిగిన లైలా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ పుష్ప 2కు వచ్చిన సక్సెస్‌కు నేను గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కనైన ఈ కుటుంబాల మధ్యన గొడవలు సద్దుమణువుతున్నాయని అంత భావించారు. కానీ.. కొద్ది గంట‌ల క్రితం ఇన్స్టా వేదికగా రామ్ చరణ్.. అల్లు అర్జున్‌ను అన్ ఫాలో చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అల్లు అర్జున్ ప్రవర్తనలో వచ్చిన మార్పులు చరణ్‌కు అసలు నచ్చడం లేదని.. అందుకే బ‌న్ని అరెస్ట్ టైంలో కూడా చ‌ర‌ణ్ త‌న‌ను క‌లిపేందుకు సుముక‌త చూపించలేద‌ని టాక్.

AA Birthday: Ram Charan Puts Full Stop To Rumours

ఇక ఇటీవల అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ తో పూర్తిగా విసుగెత్తిపోయిన చరణ్.. అల్లు ఫ్యామిలీనే పూర్తిగా బ్యాన్ చేసే స్టేజ్ కి వచ్చేసాడట. ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్ ఇన్‌స్టా వేదికగా అన్ ఫాలో చేశాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఆయన తమ్ముడు అల్లు శిరీషను మాత్రం ఇప్పటికి చరణ్ ఫాలో అవుతున్నాడు. ఒకప్పుడు ఎంతో అన్యాన్యంగా మెలిగిన ఈ మెగా కజిన్ బ్రదర్స్.. ఇప్పుడు ఇలా దూరం అవడం పై వీళ్ళిద్దరినీ కామన్ గా అభిమానించే ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వీళ్లిద్దరు మళ్ళీ కలిసి పోతే బాగుండని.. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు ఒక అప్పటిలాగా కలిసిపోతే అద్భుతాలు సృష్టిస్తారని.. ఇక వీరిద్దరూ ఎవరిదారి వారు చూసుకుంటే మాత్రం ఇద్దరికీ నష్టమే కలుపుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.