లైఫ్‌లో ఏది పర్మినెంట్ కాదు.. సమంత సెన్సేషనల్ పోస్ట్ వాళ్లని ఉద్దేశించేనా..?

స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించింది. దాదాపు 10 ఏళ్లపాటు ఇండస్ట్రీని ఏలిన ఈ అమ్మడు గత రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అడపా దడపా వెబ్ సిరీస్లలో నటిస్తూ బాలీవుడ్‌కు పరిమితమైంది. ఇక ఈ అమ్మడు సినిమాలకు దూరమైనా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తతోనే నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటుంది.

తను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పర్సనల్ విషయాలను.. అలాగే గ్లామరస్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మడి క్రేజ్ కాస్త కూడా తగ్గకుండా.. ఇప్పటికి స్టార్ బ్యూటీగా రాణిస్తుంది. అంతేకాదు.. నాగచైతన్యతో డివోర్స్ తర్వాత.. ఈ అమ్మడు ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుతుంది. కాగా.. ఇటీవల నాగచైతన్య, సమంతతో విడాకుల గురించి పలు విషయాలను పాడ్‌కాస్ట్‌లో షేర్ చేసుకున్నాడు. సమంతతో విడిపోవాలని నేను తీసుకున్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు.. 1000 సార్లు ఆలోచించి ఈ డెసిషన్లు తీసుకున్న. ఈ విషయాన్ని మేము ఎంతో గౌరవంగా బయట పెట్టాం.. మాకు ప్రవసి కావాలని చెప్పాం.

Samantha's latest Insta post hints at a break, talks about 'longest,  hardest 6 months' - India Today

కొంత మంది మాత్రం ఎంటర్టైన్మెంట్గా దీన్ని భావించారు అంటూ నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. అయితే ఇలాంటి క్రమంలో సమంత చేసిన ఓ సెన్సేషనల్ పోస్ట్ నెట్ వైరల్ గా మారుతుంది. ఆ పోస్ట్‌ నాగచైతన్యను ఉద్దేశించే స‌మంత‌ చేసిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన ఆ పోస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సమంత తన ఇన్స్టా వేదికగా రియాక్ట్ అవుతూ.. మనిషిగా మీరు ఒక స్థిరమైన జీవి కాదు.. ఏది లైఫ్ లో పర్మినెంట్ గా ఉండదు.. క‌నుక‌ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో.. అలాగే ఉండండి.. అంటూ ఒక కొటేషన్ను పంచుకుంది. ఇక‌ ఈ పోస్ట్ మాత్రం స‌మంత తప్పనిసరిగా చైతును ఉద్దేశించే చేసిందంటూ పలు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.