టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోయిన జగపతిబాబు.. ప్రస్తుతం పలు విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలకపాత్రలో నటిస్తూ విలక్షణ నటుడిగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి క్రమంలోనే జగపతిబాబు ఇండస్ట్రీలో ఎన్నో ఎఫైర్లు నడిపాడు అంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జగపతిబాబు కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారుతుంది. సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే ప్రశ్నకు.. ఆయన ఇటీవల రియాక్ట్ అయ్యాడు.
తను మాట్లాడుతూ యాక్షన్ కింగ్ అర్జున్ అంటే ఆయనకు ఎంతగానో ఇష్టం అని.. అంతకంటే ఎక్కువగా ఓ హీరోయిన్‌తో స్నేహం ఉందంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. జగపతిబాబు క్లోజ్ ఫ్రెండ్ హీరోయిన్ అనగానే అందరికీ సౌందర్యనే గుర్తుకొస్తుంది. కానీ.. సౌందర్య కాదట. రమ్యకృష్ణ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని జగపతిబాబు వెల్లడించాడు. రమ్యకృష్ణ, తాను దాదాపు ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేసామని చెప్పిన జగపతిబాబు.. నంది అవార్డు కూడా ఒకేసారి అందుకున్నామని.. తనతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటానంటూ వెల్లడించాడు.
బెస్ట్ కంపైన్ రమ్యకృష్ణ అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్‌తో సెల్ఫ్ చిట్ చాట్లో ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక జగపతిబాబు, రమ్యకృష్ణ కాంబోలో చాలా సినిమాలు తెరకెక్కి ఆడియన్స్ ని మెప్పించాయి. ఇక తర్వాత మెల్ల మెల్లగా హీరో అవకాశాలు తగ్గడంతో క్యారెట్ ఆర్టిస్ట్ గా మారిన జగపతిబాబు.. ఇటీవల పుష్ప 2, మిస్టర్ బచ్చన్, ది ఫ్యామిలీ స్టార్ ఇలా వరుస సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. ఇక నేడు జగపతి బాబు పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.