సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఎంతోమంది చిన్నారులు.. ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న ఈ కుర్రాడు కూడా అదే కోవకు చెందుతాడు. ఒకప్పుడు శ్రీదేవితో కలిసి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఈ కుర్రాడు ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అడుగుపెట్టిన ఈ బుడ్డోడు.. కెరీర్ ప్రారంభంలోనే రజనీకాంత్, శ్రీదేవి లాంటి దిగ్గజ స్టార్ సెలబ్రిటీలతో స్క్రీన్ పంచుకున్నాడు.
తర్వాత హీరోగా మారి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌తో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిల గ్రీకువీరుడుగా ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఇండియన్ ఇండస్ట్రీలో.. ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరిగా ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న స్టార్ హీరోలలో ఈయన కూడా ఉండడం విశేషం. ఇంతకీ ఈ హీరో ఎవరో చెప్పలేదు కదా.. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. 1986లో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా సినిమాలో బాలనటుడిగా హృతిక్ రోషన్ మెరిశాడు.
అప్పటి ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ సినిమాలో హీరోయిన్గా అతిలోకసుందరి శ్రీదేవి మెరిసింది. తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇందులో రజిని, శ్రీదేవితో పాటు.. పలువురు స్టార్ కాస్ట్ నటించారు. అలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన హృతిక్.. తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు. ఇటీవల ఫైటర్ తో బ్లాక్ బస్టర్ హీట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వార్ 2తో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాల్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.