ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఓసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కసారి ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టంగా ఉంటుంది. హిట్లు పడినా సరే.. దురదృష్టవశాత్తు ఆఫర్లు దక్కక ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి నటుడు, కమెడియన్ రఘుబాబు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. 2005లో అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాతో ఆయన కెరీర్ కు ఫస్ట్ బ్రేక్ పడింది. కళ్ళులేని గుడ్డి రౌడీగా తన క్యారెక్టర్ లో 100% మెప్పించిన రఘు బాబు.. తనదైన స్టైల్ లో నటనతో ఆడియన్స్‌ను తెగ నవ్వించాడు. అయితే ఈ సినిమా పరంగా ఆయనకు మంచి పేరు వచ్చినా.. సినిమా అంత పెద్ద సక్సెస్ అయినా కూడా ఆయన గురించి ఎవరు ప్రస్తావించలేదు.
100 డేస్ సెలబ్రేషన్స్ లోనూ ఆయనను ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయన ఎంతగానో బాధపడ్డారట. సరిగ్గా అప్పుడే స్పెషల్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి.. రఘుబాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మ్యాజిక్ చేశారు. స్టేజ్ పై బన్నీతో నటించిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు అందరి గురించి మాట్లాడారు. కానీ.. రఘుబాబు ప్రస్తావన ఎవరు తీసుకురాలేదు. డైరెక్టర్ వి.వి. వినాయక్ కూడా. ఇంత పేరు వచ్చాక ఇదేంటయ్యా.. ఎవరు మీ గురించి చెప్పడం లేదంటూ షాక్ అయ్యాడు. అనూహ్యంగా చిరంజీవి తన ప్రసంగంలో స్పెషల్గా రఘు బాబుని గుర్తు చేసుకుని మరి స్టేజ్ పైకి పిలిచి ఆయనను ప్రశంసించాడు. భుజం మీద చేయి వేసి బాగా చేసావని మెచ్చుకోవడం.. లైవ్‌లో జనమంతా చూశారు.
ఆ సినిమా మరోసారి చూడాలంటే దానికి మొదటి కారణం కూడా నువ్వే అవుతావు అంటూ చిరంజీవి.. రఘుబాబును ప్రశంసించారు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో రఘుబాబును అంతలా ప్రశంసించడంతో. .ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస సినిమాలో క్యూ కట్టాయి. ఒకటి కాదు రెండు కాదు అక్కడ నుంచి వరుసగా 400 సినిమాలకు పైగా అవకాశాలు కొట్టేసి నటిస్తూ బిజీ బిజీగా మారిపోయాడు. ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు అందుకున్నాడు. కాగా ఈ విషయాన్ని తాజాగా బ్రహ్మానందం నటించినా బ్రహ్మానందం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో.. రఘుబాబు స్వయంగా వెల్లడించాడు. ఇక రఘుబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.