మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు ఉన్నారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు లేడీ గెటప్ లో నటించి జ‌నాని ఎంటర్టైన్ చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ.. స్టార్ హీరోలు కూడా అలాంటి లేడీ గెటప్‌లో నటించడం అంటే అది నిజంగా సాహసమే. అయినా.. నటనపై ఇష్టంతో అలా లేడీ గెటప్‌లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ మెరిసారు.

వారిలో చిరు, వెంకటేష్, బాలయ్య, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ నటులు కూడా ఉండడం విశేషం. అలాగే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ సినిమాల్లో లేడీ గెటప్‌లో నటించిన సంగతి చాలామందికి తెలిసి ఉండదు. ఎస్ మీరు వింటుంది నిజమే.. మహేష్ బాబు కూడా ఓ సినిమాలో లేడీ గెటప్ లో చీరకట్టు, పూలతో అచ్చ తెలుగు అమ్మాయిల వయ్యారాలు వలకబోసాడు. ఇంతకీ మహేష్ బాబు లేడీ గెటప్ లో కనిపించిన ఆ సినిమా మరేదో కాదు బాలచంద్రుడు. తన సినీ కెరీర్‌లో మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సినిమాను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. కైకాల సత్యనారాయణ, రామిరెడ్డి, ఎం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ సినిమాల్లో కీలకపాత్రలో కనిపించారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా 1990లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది.

Balachandrudu

ఈ సినిమాలో ఓ స‌న్నివేశం కోసం.. రౌడీలను ఎట్రాక్ట్ చేసేందుకు మహేష్ బాబు లేడీ గెటప్‌లో కనిపించి.. కవ్వించాడు. చీర కట్టి.. పూలు చుట్టి తనదైన స్టైల్ లో యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాడు. కెరీర్ మొత్తంలో మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా అదే. పూర్తిస్థాయి హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు మ‌ళ్లి అలాంటి సాహసం చేయలేదు. ఒక‌వేళ‌ అలాంటి సన్నివేశాల్లో ఇప్పుడు మహేష్ చేసిన ఫ్యాన్స్‌ దానిని అంగీకరించరు. ఈ క్రమంలోనే మహేష్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కింనున్నట్లు సమాచారం.