టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తండేల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సినిమాకు అమ్మడి నటనతో మరింతగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున ఈ అమ్మడు తాజా సినిమాతో తండేల్ రాణిగా మారిపోయింది. అయితే లేడి పవర్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. మొదటి నుంచి పాత్రల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కంటెంట్ నచ్చి, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే నటిస్తుంది. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ఎలాంటి బడా ప్రాజెక్టు అయిన.. తనకు నచ్చకపోతే ముఖంపై నో చెప్పేస్తుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ట్రెడిషనల్ లుక్‌తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే అమ్మడి నటనతో పాటు.. క్యారెక్టర్‌కి కూడా ఫిదా అవుతున్నారు కుర్రకారు.
అలాంటి సాయి పల్లవికి టాలీవుడ్ స్టార్ హీరో అంటే అసలు నచ్చదట. ఆ హీరో పై సాయి పల్లవికి కూడా పగ ఉందంటూ ఓ న్యూస్ గతంలో తెగ వైరల్ గా మారింది. మరి సాయి పల్లవికి అంతగా నచ్చని ఆ హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. సాయి పల్లవి, నాని కాంబోలో ఎంసీఏ, శ్యామ్ సింగరాయి రెండు సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇద్దరు.. తమ నేచురల్ నటనతో పోటాపోటీగా నటించి మెప్పించారు. కాగా.. వీరిద్దరూ ఎమ్‌సిఏ మూవీ నటిస్తున్న సమయంలో నానికి, సాయి పల్లవికి మధ్య పెద్ద గొడవే జరిగిందని సమాచారం. దీంతో సాయి పల్లవి అసలు సినిమాలో నటించనని సెట్స్ నుంచి వెళిపోయిందట. ఈ క్రమంలో దిల్ రాజు ఈ గొడవల్లో కలగజేసుకుని.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి మళ్లీ సాయి పల్లవిని షూటింగ్‌కు రప్పించారని సమాచారం.
ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ వార్తలు వైరల్ అయిన తర్వాత కూడా సాయి పల్లవి.. నానితో కలిసి మళ్ళీ శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో మెరిసింది. అయితే నిజంగానే వీరి మధ్య గొడవ ఉంటే.. సాయి పల్లవి మళ్ళీ నానితో కలిసి సినిమా నటించదని ఫ్యాన్స్ నుంచి వాదన వినిపించింది. ఈ క్రమంలోనే ఆ వార్తలకు చెక్ పడ్డాయి. కానీ.. తాజాగా సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పటివరకు మీరు నటించిన హీరోలలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగగానే.. అసలు ఆలోచించుకుండా నాగచైతన్య ఇష్టమంటు చెప్పేసింది. కాగా.. ఇప్పటివరకు టాలీవుడ్‌లో నానితో మాత్రమే ఆమె రెండు సినిమాల్లో నటించింది. అయినా సాయి పల్లవి.. నాని పేరు చెప్పకుండా వెంటనే నాగచైతన్య పేరుని చెప్పడంతో నిజంగానే సాయి పల్లవికి నాని అంటే అస్సలు ఇష్టం లేదని.. అందుకే ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు అంటూ కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.