స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త నాగచైతన్యకు, ఆమెకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తాయి. వీళ్లకు విడాకులు అయ్యి చాలా కాలమైనా.. ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చిందంటే అది హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా ఒకప్పుడు సమంత, చైతన్య కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సామ్ అయితే చైతుకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పలు సందర్భాలలో షేర్ చేసుకుని తెగ మురిసిపోయేది. ఆమె మాట్లాడే మాటలను చూస్తే చైతన్య అంటే ఆమెకు ఎంత ఇష్టమో కనిపించేది.
ఇప్పటికీ సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటారు. అలా 2019లో సమంత ఫీట్ ఆఫ్ విత్ స్టార్స్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఆమె మాట్లాడుతూ నాగచైతన్యకు నన్ను ఫస్ట్ వైఫ్ అని అంతా అనుకుంటారు.. కానీ అతన్ని మొదటి భార్య నేను కాదు నేను చెబుతుంది నిజం. ఆయన మొదటి భార్య తన పిల్లోనే. కూర్చున్న, పడుకున్న, మేమిద్దరమే బెడ్ రూమ్ లో ఉన్న, ఆయనకు నేను కిస్ చేస్తున్నా.. ఏ టైంలో అయినా.. పక్కన ఆ పిల్లో ఉండాల్సిందే. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన పిల్లోనూ పక్కన పెట్టలేదు. ఇప్పటికీ తనతోనే ఉంచుకుంటాడు. అందుకే నేను నీ మొదటి భార్య కాదు. అదే అని చైతుని టీజ్ చేస్తూ ఉంటా అంటూ కామెంట్స్ చేసింది.
ఇప్పుడు మరోసారి ఆ వీడియో వైరల్ అవడంతో.. శోభిత పరిస్థితి కూడా అదే అయ్యుంటుంది అంటూ.. శోభిత కంటే కూడా ఇప్పుడు ఆ పిల్లోతోనే ఎక్కువగా ఉంటున్నాడేమో అంటూ.. నాగ చైతన్యపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైతు తన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమా రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.15 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బుకింగ్స్ ఆ రేంజ్‌లో కొనసాగడంతో.. సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.