బన్నీ బ్లాక్ బస్టర్ సినిమా బ్యాన్ చేసిన నెట్ ఫ్లిక్స్… ఇదేం షాక్‌..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లాంటి సాలిడేట్ హిట్‌తో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే బ‌న్నీ సినీ కెరియర్లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ల టూంలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందించాయి. అలాంటి వాటిలో అల వైకుంఠపురం సినిమా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ సినిమా అపట్లో సంక్రాంతి బ‌రిలో రిలీజై నాన్ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలిని డబల్ మార్జిన్‌తో క్రాస్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌ని యూటర్న్ తిప్పింది. ఇక ఈ సినిమాకు ముందు బన్నీ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఘోర డిజాస్ట‌ర్.

Ala Vaikunthapurramuloo

అయితే బన్నీ సినిమాలకు మొదటి నుంచి ఎంత పెద్ద ఫ్లాప్ వచ్చినా.. మినిమం కలెక్షన్స్ గ్యారెంటీ. కానీ.. ఈ సినిమాకు అది కూడా రాలేదు. ఫుల్ రన్ లో రూ.40 కోట్ల షేర్లు కూడా అందుకోలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్‌తో అలర్ట్ అయిన అల్లు అర్జున్.. ఇకపైన అభిమానులు కాలర్ ఎగరేసుకునే లాంటి సినిమాలు మాత్రమే తీస్తానంటే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ క్రమంలోనే అలవైకుంఠపురం సినిమా షూట్ ను చాలా గ్యాప్ తర్వాత మొదలుపెట్టాడు. అవుట్‌పుట్‌ ఆలస్యమైనా.. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ రోజుల్లోనే ఏకంగా రూ.160 కోట్లకు పైగా షేర్ వ‌సూళ్లు రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇక టీవీ టెలికాస్ట్ లోను సంచలనం.

Ala Vaikunthapurramulo Exits Netflix - TrackTollywood

ఏకంగా 30 రేటింగ్స్ వచ్చాయి. అలాంటి ఈ సినిమాను ఇకపై నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేము. నేటి నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగిస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉన్న సినిమాను ఎందుకు తీసేస్తున్నారనే సందేహం అందరికీ ఉండొచ్చు. కానీ.. ఈ సినిమా నిర్మాతలతో ఐదు సంవత్సరాల స్ట్రిమింగ్‌కు మాత్రమే అనుమతి తీసుకొందట. నేటితో అది ముగిసిపోయింది. ఈ క్రమంలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఇకపై మళ్ళి రెన్యువల్ చేసుకుంటేనే ఆ సినిమా అందులో స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ.. వాళ్ళు రీ రెన్యువల్ కు ఆసక్తి చూపడం లేదట. ఈ క్రమంలోనే కేవలం సన్ నెక్స్ట్‌లో మాత్రమే అల వైకుంఠపురం సినిమా చూడగలరు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో పిరియాడికల్ మూవీ తెర‌కెక్కనుంది. త్వరలోనే సినిమా గ్రాండ్ లెవెల్‌లో స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.