టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరగా సలార్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మిల్స్ ఇచ్చినా ప్రభాస్.. కల్కి 2898 ఏడి సినిమాతో రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని.. తన క్యారెక్టర్ చాలా గొప్పదంటూ ఆయనతో పని చేసే వారంతా ఎప్పటికప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే హీరోగాను ప్రభాస్‌కు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ తప్పక చర్చించాలి. ఇక ప్రభాస్ మొదటినుంచి ఆహరప్రియుడు.
ఈ క్రమంలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఆహారాలను టేస్ట్ చేస్తూ ఉండే ఆయన.. తనతో పాటు ఉండే వ్యక్తులకు కూడా ఫుల్ గా ఫుడ్ తినిపిస్తారు. రాజమర్యాదలతోనే చంపేస్తాడు అంటూ చాలామంది సెలబ్రెటీస్ ఇప్పటికే ఆయన భోజనాన్ని గురించి రకరకాలుగా షేర్ చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఒకప్పటి స్టార్ బ్యూటీ శ్రీదేవి.. ప్రభాస్ గురించి మాట్లాడితూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. నటి శ్రీదేవి మాట్లాడుతూ ప్రభాస్ ఫుడ్ హ్యాబిట్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ విషయాని షేర్ చేసుకుంది. అతను చాలా ఫుడ్ లవర్ అని.. తన వద్దకు వచ్చినా గెస్ట్ లకు ఎంతో ప్రేమగా అన్ని రకాల వంటలు చేయించి పెట్టేస్తాడని వివరించింది. తనకే తెలియని వంటకాల పేర్లను ప్రభాస్ చెబుతుండడంతో నేను ఆశ్చర్యపోయానని.. నేను ఎక్కువగా బిర్యాని తినేందుకు ఇష్టపడతాను అంటూ వివరించింది.
ఇక ప్రభాస్ కూడా హైదరాబాద్ బిర్యాని చాలా ఇష్టంగా తింటారు. ఎంతో చక్కగా వంటకాలు గురించి ప్రభాస్ చెప్పడం తనకు ఇంకా గుర్తుందంటూ వివరించిన శ్రీదేవి.. ప్రభాస్ ఏదైనా వంట గురించి చెప్తే వెంటనే వండేసి తినాలని ఆరాటపడేలా చేస్తాడని వివరించింది. అంతేకాదు.. ప్రభాస్ గురించి మరో ఇంట్రస్టింగ్ మ్యాటర్‌షేర్ చేసుకున్నా ఆమె.. తను ఎంత ఫుడ్ లవరైనా తనకు కావాల్సినంత వరకే తింటాడు. ఇతరులను మాత్రం తినేవరకు వదిలిపెట్టడంటూ చెప్పుకొచ్చింది. తను మోతాదులో తిని.. ఇతరులను తినాల్సిందేనంటు చీట్ చేస్తాడని.. ఇక ఎవరికి ఐటెం కావాలో స్పెషల్ గా వండిస్తాడని.. తను మాత్రం తన స్పెషల్ డైట్ ని ఫాలో అవుతాడని వివరించింది. ఎంత ఆకలేసిన డైట్ రూల్స్ ను మాత్రం బ్రేక్ చేయడట.