TJ రివ్యూ: కౌసల్య సుప్రజా రామ.. పెళ్లి త‌ర్వాత హీరో ఎందుకు మారిపోతాడు…!

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే వారం వారం కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు రిలీజై ఆడియన్స్‌ను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అలా తాజాగా ఈటీవీ విన్ ఒటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయిన సిరీస్ కౌసల్య సుప్రజా రామా. గురువారం రిలీజ్ అయిన ఈ సిరీస్‌ మొదట కన్నడలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. తర్వాత తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇంతకీ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. విశ్లేషణలో చూద్దాం.

Kousalya Supraja Rama OTT release date: When and where to watch Telugu  version of Darling Krishna's film online | PINKVILLA

కథ
రామ్ (డార్లింగ్ కృష్ణ) చిన్నప్పటి నుంచి అమ్మాయిలను చిన్నచూపు చూస్తూ.. వయసుతో పాటు ఆడవాళ‌పై ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మేనత్త కొడుకు సంతూ (నాగభూషణ్)కు కూడా తనతో పాటే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా చేసేస్తాడు. వీటన్నిటికీ రామ్‌ తండ్రి కారణం. అయితే అలాంటి రామ్.. శివాని (బృందా ఆచార్య) ను ప్రేమిస్తాడు. అక్కడ కూడా తనదే పై చేయి కావాలని కోరుకునే రామ్ మనస్తత్వం నచ్చక.. శివాని అతని దూరం పెడుతుంది. అదే టైంలో రామ్ తల్లి కౌసల్య (సుధా బెలవాడి) చ‌నిపోతుంది. ఇక తల్లి చూసిన సంబంధం కావడంతో.. పెళ్లిచూపులు కూడా వద్దని ముత్తు లక్ష్మీ (మలీన నాగరాజ్) తో వివాహం చేసుకుంటాడు. అసలైన గేమ్ అక్కడే మొదలైంది. శివానిని ఏ కారణంతో రామ్ వ‌ద్దు అంటుకుంటాడో.. అంతకు మించిన ముత్తు లక్ష్మీ ఆటిట్యూడ్‌తో రామ్ ఎందుకు సర్దుకుపోవాల్సి వచ్చింది.. ఆ ప్రయాణంలో అతడిలో ఏదైనా మార్పు వచ్చిందా.. తనలాగే పురుషాహంకారంతో ఉండే తండ్రిలోనూ కనువిప్పు కలిగించాడా.. అది ఎలా.. అనేది అసలు స్టోరీ.

విశ్లేషణ:
పెద్ద పెద్ద ఫైట్లు, భారీ డైలాగులు, ట్విస్ట్‌లు ఇలాంటివి లేకుండా.. కథను మాత్రమే అనుసరిస్తూ సాఫీగా సాగే సినిమా. లింగ వివక్షతో కొందరు ఎంతగా విరవీగుతారో.. మగవాడిని అన్న అహంతో మహిళలను మానసికంగా ఎంత బాధ పెట్టి.. ఒత్తిడి తెప్పిస్తారు.. కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అమ్మ జ్ఞాపకాలతో ఓ వ్యక్తి తనకు తాను గొప్పగా ఎలా మారాడు.. అనే కోణాన్ని సినిమాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతేకాదు ప్రస్తుత జనరేషన్ కు తగ్గట్టుగా తల్లిదండ్రుల ఒత్తిడితో పిల్లలు ఆసక్తి లేని కోర్సులు జాయిన్ అయ్యి లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అనే పాయింట్ను టచ్ చేస్తూ.. ఏదో సందేశం ఇస్తున్నట్లు కాకుండా అంతర్లేనంగా చెప్పేందుకు డైరెక్టర్ సుశాంత్ ప్రయత్నం చేశాడు.

Movie - Kousalya Supraja Rama (Kannada w. English Subtitles) - Victory  Cinema

ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ సాధించాడు. సంతూ నిశ్చితార్థానికి ముడిపెడుతూ.. హీరో ఫ్లాష్ బ్యాక్ పరిచయం చేసే ఎంట్రీ సీన్స్ నుంచే సినిమాల్లో కామెడీ మొదలవుతుంది. రామ్, సంతు కనిపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అమ్మ‌యిలంటేనే న‌చ్చ‌ని రామ్.. శివానితో ఫ్రెండ్షిప్ చేయడం, ప్రేమలో పడడం అస‌లు అతకలేదు. కానీ.. శివాని బ్రేకప్ కు గల కారణాన్ని రామ్ తల్లి పాత్ర వైపు నుంచి చక్కగా మలుపు తిప్పారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే సన్నివేశాలను మరింత డెప్త్ ఉంటే బాగుండేది. కాగా ఎప్పటికప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ.. తాగి తూలుతూ, క్లాసులు బంక్ కొట్టే హీరోకు జాబ్ రావడం నాచురల్ గా అనిపించదు.

మదర్ సెంటిమెంట్ బానే వర్కౌట్‌ అయింది. వివాహం తర్వాత రామ్ లైఫ్ లో మ్యారేజ్ తో ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అనే అంశాన్ని ఇంటర్వెల్ బ్యాక్‌తో ఆడియోస్ లో ఇంట్రెస్ట్ తెప్పించల రూపొందించారు. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే.. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ కాస్త ఎక్కువగానే పండించారు. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ముత్తు లక్ష్మీ, రామ్ రోల్స్ చుట్టూనే తిరుగుతుంది. ఇక తన తల్లి జ్ఞాపకాలతో ఉంటూనే.. భార్యను రామ్ ఎలా తన దారిలోకి తెచ్చుకున్నాడు అనేది ప్రధాన అంశం. అయితే.. అనుకున్నది జరగకపోతే మందు తాగుతూ తిరిగే అమ్మాయిగా లక్ష్మి పాత్రను చూపించడం ఆడియన్స్ కు చిరాకు తెప్పించింది. అయినా ఆమె గతం కాస్త ఆలోచింపజేసేలా ఉంది. క్లైమాక్స్ హార్ట్ టచ్ చేసేలా రూపొందించారు. ఇక సిరీస్ సంతు పాత్ర యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

Kousalya Supraja Rama Review: రివ్యూ: కౌసల్యా సుప్రజా రామ: హీరో పెళ్లి  తర్వాత మారాడా? | kousalya-supraja-rama-review-etv-win

ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తూ.. ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది. ఎలాంటి అస‌బ్య‌క‌ర సన్నివేశాలు, అడ‌ల్ట్‌ కామెడీలు లాంటివి లేకుండా.. చాలా నేచుర‌ల్‌గా ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్టైన్ చేశారు. సుమారు 2 గంటల 30 నిమిషాల్లో రైన్ టైం తో రూపొందిన ఈ సినిమా.. టైం పాస్ అయ్యితే చాలు అనుకుంటే కచ్చితంగా ప్రయత్నించొచ్చు.

ఫైనల్ గా:
ఫన్ అందిస్తూనే.. మెసేజ్ ను ఇచ్చిన అద్భుతమైన కథ కౌస‌ల్య సుప్ర‌జా రామ‌.