ప్రభాస్ టచ్ కూడా చేయ‌లేక‌పోయిన‌ ఆ రికార్డ్.. తారక్ కు సాధ్యమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో బౌండరీలు దాటేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక నెలకొల్పిన రికార్డులను మరొకరి పటాపంచలు చేసేస్తున్నారు. ముఖ్యంగా.. యూఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పటినుంచో గట్టి మార్కెట్ ఉంది. అయితే.. కొన్ని సినిమాలు ఎవరు ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు సినిమాలుకు భారీ మార్కెట్ ఏర్పడుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. బాహుబలి సినిమా అక్కడ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమా మరింత పెద్ద బ్లాక్ బ‌స్టర్, ఇండియన్ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను అది పటాపంచలు చేసింది.

Telugu Cinema Takes Japan by Storm with "Kalki 2898 AD"! | Telugu Cinema  Takes Japan by Storm with "Kalki 2898 AD"!

ఇక ఈ రెండు సినిమాలు రాజమౌళి తెర‌కెక్కించినవే కావడం విశేషం. బాహుబలి తర్వాత.. ప్రభాస్ నుంచి వచ్చిన చివరి మూవీ కల్కి సినిమా జపనీస్‌లో డబ్ చేసి.. బాగా ప్రమోట్ చేశారు. కానీ.. అక్కడ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది. రిలీజ్ తర్వాత దాని గురించి పెద్దగా డిస్కషన్ ఏవి రాలేదు. అయితే ప్రస్తుతం జపాన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ చివరి మూవీ దేవర జపనీస్‌లో డబ్ చేసి మార్చ 28న రిలీజ్ చేయనున్నాడు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా.. తారక్‌ జపాన్ అభిమానులతో ఆన్లైన్లో వీడియో చిట్ చాట్ చేసి వారిని ఫిదా చేశాడు. త్వరలోనే తారక్‌ జపాన్‌కు వెళ్లి.. సినిమాను ప్రమోట్ చేయనున్నారని టాక్.

Jr NTR's 'Devara: Part 1 Set to Release in Japan

తారక్‌.. ఆర్‌ఆర్ఆర్ చేయడానికి ముందే.. జపాన్‌లో మంచి క్రేజ్‌ దక్కించుకున్నాడు. కల్కి లాంటి విజువల్ వండర్ మూవీనే జపాన్ ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదంటే.. మామూలు సినిమాలు అక్కడ ఎలాంటి రిజ‌ల్ట్ అందుకొంటాయో అన్న సందేహం నెలకొంది. ఈ క్రమంలోనే.. తారక్‌ జపాన్‌లో మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలంటే.. ఏదైనా వైవిధ్యమైన ప్రమోషన్స్‌తో పెద్ద ఈవెంట్‌తో అక్కడ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి. దేవర మూవీ.. తెలుగు ప్రేక్షకులలో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మరి విదేశాల్లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ విధంగా సత్తా చాటుతుందో వేచి చూడాలి. ఈ విషయంలో ప్రభాస్‌కు వర్కౌట్‌ కానీ ఆ రికార్డు.. ఎన్టీఆర్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి.