టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ రాజమౌళి విషయంలో తాజాగా వివాదం చోటుచేసుకుంది. రాజమౌళి స్నేహితుడైన యు.శ్రీనివాసరావు షాకింగ్ సూసైడ్ నోట్‌తో పాటు.. సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసాడు. ఇందులో భాగంగా రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతూ సంచలనం సృష్టించింది.
రాజమౌళిది, నాది 30 ఏళ్ల స్నేహబంధం అని.. ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చేయకముందు నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఈ విషయం చాలామందికి తెలుసు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గాను నేను వ్యవహరించా. కానీ.. రాజమౌళి తన లైఫ్‌లో ఒక మహిళ ప్రవేశించడంతో నన్ను దూరం పెట్టేసాడు. ముందు రాజమౌళి, ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించామని వివరించాడు. అయితే కెరీర్ బిగినింగ్ టైం లో వివాదం వద్దన్నా కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని తనకు త్యాగం చేశాను.
రాజమౌళి వల్లే యాబై నాలుగు ఏళ్లుగా బ్యాచిలర్గా మిగిలిపోయా. ఆయన నెంబర్ వన్ అవడం కోసం నా లైఫ్‌లో త్యాగం చేసేసా. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని.. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేసేసాడు. చివరికి నేను చనిపోయేదాకా తీసుకువచ్చాడు.. పోలీసులు కేసు ఫైల్ చేసి రాజమౌళి, రామ రాజమౌళి ఇద్దరికీ లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు రాజమౌళి. క్షుద్రవిద్యాలన్నీ వచ్చు అని.. అతనికి అడ్డుగా వస్తారని అనుకున్న దర్శకులందరిని పక్కకు తప్పించుకుంటూ నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడంటూ వివరించాడు.