ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా రాణిస్తున్న ఎంతో మంది ఇతర కోస్టార్స్‌తో.. అలాగే దర్శకులతో మంచి హెల్దీ బాండింగ్ ను కలిగి ఉంటారు. ఇలాంటి వారిలోనే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, ఎన్టీఆర్ – బన్నీ, ఎన్టీఆర్ – రాజమౌళి, సుకుమార్ – బన్నీ.. ఇలా చాలా మంది ఉంటారు. ఫ్రెండ్షిప్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ.. ఎప్పుడూ ఇతరుల పర్సనల్ విషయాల్లోను.. లిమిట్స్ దాటి కానీ.. ప్రవర్తించరు. ముఖ్యంగా ఏ మూమెంట్‌లోను.. అసలు మితిమీరి టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడరు. ఒరై.. అరై.. పోరా.. అలాంటి మాటలు అనుకోరు.
కానీ.. కొంతమంది మాత్రం చాలా చనువుగా తమ తోటి హీరోలను సొంత వ్యక్తులుగా, ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్. ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అయితే తారక్ అంటే.. మెగాస్టార్ చిరంజీవికి చాలా చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే చాలా ఇంటర్వ్యూలో.. ఓపెన్‌గానే జూనియర్ ఎన్టీఆర్‌ను పొగిడేస్తూ.. తారక్ డ్యాన్స్ గురించి ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.
అంతే కాదు.. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలతో చనువు ఉన్న.. కేవలం ఎన్టీఆర్‌ని మాత్రమే.. చనువుగా ఏరా అంటూ తన పిల్లాడిని పిలిచినట్లు పిలుస్తారట. మిగతా హీరోలు క్లోజ్‌గా ఉన్నా సరే.. ఆయన లిమిట్స్ క్రాస్ చేయకుండా వాళ్ళని పేరు పెట్టి సంబోధిస్తూ ఉంటారు. ఒక జూనియర్ ఎన్టీఆర్‌ని మాత్రమే చాలా పర్సనల్‌గా దగ్గర వ్యక్తిని ట్రీట్ చేసినట్టు కుటుంబ సభ్యుడిగా భావిస్తూ దగ్గరికి తీసుకుంటారు. మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు, తారక్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరి మధ్య బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.