మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బిగ్ మిస్టేక్… అయోమ‌యం.. దేవాల‌యం..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు వారసులుగా చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అతి తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్నారు. వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వారి తర్వాత కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే.. చిరు ఫ్యామిలీ సక్సెస్ రేట్ ఎక్కువ. అయితే.. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో స్టాప్ తెరపైకి వస్తాడని.. అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలు అడియాసలు అవుతున్నాయని.. నిరీక్షణకు చెక్ పడేలా లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య డై హార్ట్ ఫ్యాన్స్ గ‌త పదేళ్ళుగా.. మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా ఎంతో స్పెషల్‌గా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తే చాలు.. ఆయన స్టార్ అయిపోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే.. ఈ విషయంలో ఒత్తిడి కూడా చేస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల నట వారసులుగా 20,25 ఏళ్లకే తమ కొడుకులు ఎంట్రీ చేస్తూ ఉంటారు. మోక్షజ్ఞ వయసు ఇప్పుడు 30+ ఉన్న ఇంకా ఇండస్ట్రీకి రాకపోవడానికి మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేకపోవడమే కారణమంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Moksghana to enter Prashant Varma's Cinematic Universe - Telugu News -  IndiaGlitz.com

అయితే గత రెండేళ్లుగా ఆయన తీరులో మార్పు వచ్చింది. శరీరాకృతిని కూడా స్లిమె అండ్‌ ఫీట్‌గా మార్చుకున్న మోక్షజ్ఞ.. బాలయ్య షూటింగ్ సెట్స్‌లోను సందడి చేశాడు. నటన కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడట. ఈ క్రమంలోనే.. అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే గతేడాది చివర్లో గ్రాండ్గా పూజ కార్యక్రమానికి ప్లాన్ చేయగా.. చివరి నిమిషంలో అది మిస్సయింది. దీంతో.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన ప్రశాంత్ వర్మ.. ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్టు లైన్‌లో పెట్టనున్నాడట. జై హనుమాన్ తో బిజీగా ఉన్నా ఆయన.. ఆ సినిమా పూర్తైన వెంట‌నే ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ కోసం మరో కొత్త డైరెక్టర్‌ను సెట్ చేసి కథను వెతికి సినిమా సెట్స్‌పైకి తీసుకురావడానికి దాదాపు రెండేళ్లు సమయం పడుతుంది. దీంతో బాలయ్య తన సినీ కెరీర్ రాజకీయాలతో బిజీగా ఉండి.. కొడుకు కెరీర్‌పై ఫోకస్ పెట్టలేదని.. బిగ్ బ్లండర్ మిస్టేక్ చేసాడంటూ.. ఆయన డైరెక్టర్ సెలెక్షన్ అసలు బాలేదు.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.