ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలంగాణకు చెందిన ఈ అమ్మడు.. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత హైదరాబాద్‌లోనే పూర్తి చేసింది. తర్వాత.. చెన్నైకి వెళ్లి ఎంబిబిఎస్ కంప్లీట్ చేసి అక్కడే కొంతకాలం పని చేసింది. హైదరబాద్ తిరిగివచ్చి.. అపోలో హాస్పిటల్లో ఆరేళ్ల పాటు తన సేవలు కొనసాగించింది. చిన్నప్పటినుంచి తనకు నటి కావాలనే కోరిక ఉండడంతో.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి మిస్ తెలంగాణ పోటీల్లో సక్సెస్ సాధించింది.
తర్వాత.. మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు దక్కించుకుంది. ఆపై.. మెయిన్ లీడ్‌గాను నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇంత చెప్పాం కదా.. ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా..? సర్లేండి అది కాస్త కష్టం. మేమే చెప్పేస్తాం.
తాను మరెవరు కాదు పొలిమేర 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అందరినీ ఆకట్టుకున్న కామాక్షి భాస్కర్ల. పై చూస్తున్న ఈ ఫొటోస్ ఆమె టీనేజ్ నాటివి. 2022లో ప్రియురాలు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కామాక్షి భాస్కర్ల.. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మా ఊరి పొలిమేర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఓం బీమ్ బుష్ లాంటి ఎన్నో సినిమాలలో నటించింది. ఝాన్సీ, సైతాన్, దూత లాంటి సిరీస్లలోనూ ఆకట్టుకుంది. 2018లో చాలా బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం స్లిమ్ లుక్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.