పరిచయం :
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ శబ్దం. అరివళగన్ డైరెక్షన్లో రూపొందింది. ఇక ఆది పినిశెట్టి, అరివళగల్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ కాంబో. గతంలో వీరిద్దరి కాంబోలో.. వైశాలి హారర్ థ్రిలర్‌గా తెరకెక్కింది. సక్సస్ అందుకుంది. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే శబ్ధం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిందా..? లేదా..? సినిమా ఎలా..? ఉందో చూద్దాం.
స్టోరీ :
మున్నార్‌లోని ఓ వైద్య కళాశాల నేపథ్యంలో స్టోరీ మొదలైంది. ఒకరి తర్వాత ఒకరిగా కాలేజీలో విద్యార్థులంతా అనుమానస్పదంగా మృతి చెందుతూ ఉంటారు. పోలీసులకు, మీడియాకు విషయం తెలిస్తే కాలేజీ ఫేమ్ దెబ్బతింటుందని ఉద్దేశంతో.. యాజమాన్యం గోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో అసలు కాలేజీలో ఏం జరుగుతుందో పరిశోధన జరపాలని.. దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలని భావిస్తారు. దాని కోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్య లింగా (ఆది పినిశెట్టి)ని కాలేజీకి పిలుస్తారు. తను మనుషులకు వినిపించని శబ్దాల్ని.. తన వద్ద ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ గోస్ట్ లతో మాట్లాడి.. ఆ కేసులను పరిష్కరిస్తాడు.
ఈ క్రమంలోనే అతనికి ఆ కాలేజీలో పని చేసే అవంతిక (లక్ష్మి మేనన్) పై అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలోనే కాలేజీలో సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగానికి రెడీ అవుతాడు. అక్కడ 42 ఆత్మలు ఉన్నట్టు అతని తెలుసుకుంటాడు. మరి ఆత్మలుగా మారిన 42 మంది ఎవరు..? వాళ్లకు, కాలేజీలో జరుగుతున్న చావులకు ఉన్న కనెక్షన్ ఏంటి..? అసలు ఆ లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది..? దానికి కాలేజ్ మాజీ చైర్మన్ డాక్టర్ డయానా (సిమ్రాన్)కు ఉన్న సంబంధం ఏంటి..? నాన్సీ డేనియల్ (లైలా) పాత్ర ఏంటి..? అనేది థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించి యుద్ధాలు చేసిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలాగే శబ్దం నుంచి పుట్టే సంగీతంతో కొన్ని జబ్బులు నివారించవచ్చు అని కూడా చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాం. ఈ రెండు కోణాలతో పాటు అతీంద్రియ శక్తుల లాంటి అంశాలు తో ముడి వేసి కథను హారర్ థ్రిలర్గా క్రియేటివ్ గా రూపొందించారు. కాలేజీలో జరిగే విద్యార్థులు చావుల ఎపిసోడ్తో నేరుగా కథను ప్రారంభించి.. వెంటనే ఫారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా హీరో పాత్రను ఇంటర్వ్యూ చేశాడు. ఓ పాప ఆత్మతో మాట్లాడే ఎపిసోడ్‌తో తన శక్తి యుక్తులని పరిచయం చేశాడు.
ఇక హారర్ థ్రిల్లర్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటే.. ఆడియన్స్ కథకు కనెక్ట్ అవ్వడం సహజం. అది ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. హీరో ఎక్స్పరిమెంట్ క్షణక్షణం ఆడియోస్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఫ్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే కొన్ని హారర్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో కళాశాలలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ ప్రయోగం, అక్కడ 42 ఆత్మలు ఎవరివి.. అవంతికకు, ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి..? అనే కోణంలో కథ మొత్తం సాగుతుంది. కీలకమైన 42 ఆత్మల ఫ్లాష్ బ్యాక్‌లు, వాళ్ళ చావులు.. ఆడియన్స్‌కు కాస్త గందరగోళం కల్పించినా.. క్లైమాక్స్‌లో శబ్దం.. ఆత్మల నేపథ్యంలో సాగే పోరు.. ఆడియన్స్ లో ఆసక్తి కల్పించినా.. మధ్యలో ఆడియన్స్ కు అనవసరమైన యుద్ధ శబ్దంలా ఫీల్ కలుగుతుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా రోల్‌లో ఆది పినిశెట్టి ఎంతవరకు ఆకట్టుకున్నాడు. ఆది రోల్ తీర్చిదిద్ది దిన తీరు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కల్పించింది. అవంతిక (లక్ష్మి మేనన్) కథలో కీలక పాత్రలో మెరిసింది. ఇంటర్వెల్ తర్వాత ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు భయపెడుతూనే.. మరోపక్క ఇంట్రెస్ట్‌ని కలిగించేలా చేశాయి. రావడానికి ఇన్సులే కామెడీ అక్కడ వరకు అయింది. ఇక ఫస్ట్ హఫ్ స్టోరీ నడిపిన విధానం.. సెకండ్ హాఫ్‌పై అత్యంత ఆసక్తిని పెంచేసింది. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త స్టోరీ గందరగోళంగా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ స్టోరీలో కొద్ది సినిమా రొటీన్ గా మారిపోతున్న ఫీల్ వస్తుంది.
టెక్నికల్ గా:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా శబ్దం నేపథ్యంలో వచ్చే ప్రతి సీను ప్రేక్షకులను భయపెడుతుంది. ఈ విషయంలో థమన్ 100% ఎఫర్ట్స్ ఇచ్చాడు. అలాగే సౌండ్ డిజైనింగ్ వర్గం పనితీరు కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్న సినిమా.
ప్లస్ లు:
స్టోరీ బ్యాక్ డ్రాప్, ట్విస్టులు, ఆది పినిశెట్టి యాక్టింగ్, ఇంటర్వెల్ సీన్, లక్ష్మీ మేనన్ రోల్
మైనస్ లు:
సెకండ్ హాఫ్ స్టోరీలో నెలకొన్న కన్ఫ్యూజన్, క్లైమాక్స్.
చివరిగా: ఆది పినిశెట్టి శబ్దం భయపెడుతూనే ఆకట్టుకున్నా.. కాస్త ఇబ్బంది తప్పదు.